https://oktelugu.com/

MP Raghurama: సీఎం జగన్, విజయసాయి బెయిల్ రద్దు.. మళ్లీ షాకిచ్చిన ఎంపీ రఘురామ

raghurama raju ask hc to stop deliver cbi court verdict on jagan vijaya sai reddy bail cancel petition: ‘వదల బొమ్మాలి.. వదలా’ అంటే ఏపీ సీఎం జగన్, వైసీపీ సీనియర్ ఎంపీ విజయసాయిరెడ్డి వెంటపడ్డాడు ఎంపీ రఘురామ.. వెంటపడడమే కాదు.. వేటాడేస్తున్నారు. ఇప్పటికే జగన్, విజయసాయిరెడ్డిల బెయిల్ పిటీషన్లు రద్దు చేయాలని కోరుతూ సీబీఐ కోర్టులో పిటీషన్లు వేశాడు ఎంపీ రఘురామ.. ఈ వారంలోనే వాటి తీర్పులు వెలువరించబోతున్నారు. వీరిద్దరి […]

Written By:
  • NARESH
  • , Updated On : September 14, 2021 1:31 pm
    Follow us on

    Jagan RRR

    raghurama raju ask hc to stop deliver cbi court verdict on jagan vijaya sai reddy bail cancel petition: ‘వదల బొమ్మాలి.. వదలా’ అంటే ఏపీ సీఎం జగన్, వైసీపీ సీనియర్ ఎంపీ విజయసాయిరెడ్డి వెంటపడ్డాడు ఎంపీ రఘురామ.. వెంటపడడమే కాదు.. వేటాడేస్తున్నారు. ఇప్పటికే జగన్, విజయసాయిరెడ్డిల బెయిల్ పిటీషన్లు రద్దు చేయాలని కోరుతూ సీబీఐ కోర్టులో పిటీషన్లు వేశాడు ఎంపీ రఘురామ.. ఈ వారంలోనే వాటి తీర్పులు వెలువరించబోతున్నారు. వీరిద్దరి బెయిల్లు రద్దు అవుతాయా? లేదా? అనే దానిపై ఏపీ రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

    ఇదే సమయంలో మళ్లీ ఎంపీ రఘురామ ఎంట్రీ ఇచ్చి ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు. దీనికి అందరూ షాక్ అయిన పరిస్థితి నెలకొంది. ఏకంగా ఈ తీర్పులపై తెలంగాణ హైకోర్టుకు ఎంపీ రఘరామ ఎక్కారు. దీంతో ఈ వ్యవహారం ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది.

    ఇప్పటికే అక్రమాస్తుల కేసులో జగన్, విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ సీబీఐ కోర్టులో రఘురామ పిటీషన్లు వేశారు. దీనిపై సుధీర్ఘ వాదనలు అనంతరం గత 23న తీర్పుకు సిద్ధమైంది కోర్టు. అయితే సుప్రీంకోర్టు ఈ కేసులపై ఇచ్చే ఆదేశాల కోసం ఎదురుచూస్తే క్రమంలోనే తీర్పులను ఈనెల 15వ తేదీకి అంటే రేపటికి వాయిదా వేశారు.

    రేపు సీబీఐ కోర్టు తీర్పు వెలువడుతున్న నేపథ్యంలో వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ మళ్లీ ఊహించని షాక్ ఇచ్చారు. సీబీఐ కోర్టు తీర్పు వెలువరించకుండా ఆదేశాలు ఇవ్వాలని తెలంగాణ హైకోర్టును కోరారు. దీంతో ఈ వ్యవహారం అనూహ్యమైన మలుపు తిరిగింది. దీనిపై బారీ చర్చ నడుస్తోంది.

    రేపు వెలువరించే తీర్పులు ఆపాలని.. వీరిద్దరి బెయిల్ పిటీషన్లపై సీబీఐ కోర్టులో కాకుండా మరో కోర్టులో విచారణ జరపాలని హైకోర్టులో ఎంపీ రఘురామ పిటీషన్ వేయడం సంచలనమైంది. తీర్పు రాకుండానే దానిపై రఘురామ హైకోర్టును ఆశ్రయించడం చర్చనీయాంశమైంది. దీంతో సీబీఐ కోర్టులో తీర్పు తనకు తీర్పు ప్రతికూలంగా వస్తుందనే రఘురామ ఈ స్కెచ్ గీశాడా? అన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. దీనిపై హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఉత్కంఠ రేపుతోంది.