https://oktelugu.com/

వాలంటీర్ల వ్యవస్థపై ఏంపీ రఘురామ ఏమన్నారంటే?

నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు మరోసారి రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. గ్రామ వాలంటీర్ల వ్యవస్థ, కరోనా ను ఎదర్కోవడంలో ప్రభుత్వ వైఫల్యం, సీఎం రిలీఫ్ పండ్ కు ఎమ్మెల్యేల చందాలు, మధ్యం విక్రయాలు తదితర అంశాలపై ఆయన విమర్శల బాణాలు ఎక్కుపెట్టారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందిన తొలి రోజుల్లో ఏపీలో కేసులు ఇతర రాష్ట్రాల కంటే తక్కువగా ఉండేవని, ఆ ఘనత వాలంటీర్ల వ్యవస్థ వల్లే సాధ్యమైందని, వీరు వ్యాది […]

Written By:
  • Neelambaram
  • , Updated On : August 9, 2020 / 10:25 AM IST
    Follow us on


    నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు మరోసారి రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. గ్రామ వాలంటీర్ల వ్యవస్థ, కరోనా ను ఎదర్కోవడంలో ప్రభుత్వ వైఫల్యం, సీఎం రిలీఫ్ పండ్ కు ఎమ్మెల్యేల చందాలు, మధ్యం విక్రయాలు తదితర అంశాలపై ఆయన విమర్శల బాణాలు ఎక్కుపెట్టారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందిన తొలి రోజుల్లో ఏపీలో కేసులు ఇతర రాష్ట్రాల కంటే తక్కువగా ఉండేవని, ఆ ఘనత వాలంటీర్ల వ్యవస్థ వల్లే సాధ్యమైందని, వీరు వ్యాది భారిన పడిన వారిని వెంటనే గుర్తిచగలుగుతున్నారని ప్రభుత్వం వెల్లడించిందని, మరి ఇప్పుడు ఇన్ని వేల సంఖ్యలో కేసులు పెరిగి పోవడానికి కారణం ఏంటి, వాలంటీర్ల వ్యవస్థ సక్రమంగా పని చేయడం లేదా? ఈ విషయాన్ని ప్రభుత్వం గమనించాలని కోరారు.

    Also Read: ‘కరోనా’ని మించిన డేంజర్ ఏపీలో.. ప్రభుత్వ వైఫల్యమే(నా)..?

    అదే విధంగా సిఎం రిలీఫ్ ఫండ్ కు ఏ ఎమ్మెల్యే తన సొంత నిధులు ఇవ్వలేదని, ప్రజలు, వ్యాపారుల నుంచి విరాళాలు బలవంతంగా వసూలు చేసి సిఎంకు విరాళాల చెక్కు ఇస్తూ ఫోటోలకు పోజులు ఇచ్చారని చెప్పారు. ఈ విషయాన్ని సిఎం గమనించాలని కోరారు. ఈ అంశంపై విపక్షాలు ఇప్పటికే అనేక ఆరోపణలు చేశాయి. మధ్యం విషయంలో ఊరు పేరు లేని బ్రాండ్లతో ప్రజల ప్రాణాలకు ముప్పు తెస్తున్నారు. శానిటైజర్ లు తాగి పదుల సంఖ్యలో ప్రజలు మృతి చెందడంపై ప్రభుత్వం స్పందించాలన్నారు. క్వారంటైన్ కేంద్రాల్లో ప్రజలు ఆకలితో కేకలు పెడుతున్నారని చెప్పారు. మూడు రాజధానుల విషయంలో ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తప్పదని చెప్పారు. హై కోర్టు ఇచ్చిన మధ్యంత ఉత్తర్వులపై సుప్రీం పీటీషన్ వేసిన ప్రభుత్వానికి చుక్కెదురవుతుందని జోస్యం చెప్పారు.

    Also Read: వైసీపీ సవాల్ కు బాబు స్పందిస్తారా?

    వైసీపీలో ఉంటూ ఆ ప్రభుత్వ నిర్ణయాలపై, కార్యక్రమాలపై విమర్శలు చేస్తున్న ఎంపీ రఘరామ కృష్ణంరాజు విషయంలో ప్రభుత్వం స్పందించకపోవడంతో ఎంపీ రోజు రోజుకు విమర్శల తీవ్రతను పెంచుతున్నారు. ఇప్పటి వరకూ ఒకటి రెండు అంశాలపైనే విమర్శించే ఎంపీ ఈ రోజు అనేక అంశాల్లో ప్రభుత్వాన్ని ఏకి పారేశారు. ప్రజాధరణ కలిగిన సిఎంలలో జగన్ కి మూడవ స్థానం రావడాన్ని తేలిగ్గా కోట్టి పారేశారు. సంక్షేమ పథకాల అమలు వల్లే ఈ గుర్తింపు వచ్చిందన్నారు. కరోనా విషయంలో భారత్ లోని బ్రిటన్ డిప్యూటీ కమిషనర్ ఫ్లెమ్మింగ్ కితాబు ఇవ్వడంపైనా స్పందించారు. ఈ విషయంలో ఆమెకు పూర్తి స్థాయి వివరాలు తెలియకపోవడంతో కితాబు ఇచ్చి ఉంటారని చెప్పుకొచ్చారు.