https://oktelugu.com/

ఢిల్లీ హైకోర్టులో పిటీషన్ వేసిన ఆర్ఆర్ఆర్..!

నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు రాష్ట్ర ప్రభుత్వానికి కొత్త ట్విస్ట్ ఇచ్చారు. తనకు ఆంధ్రా పోలీసులపై నమ్మకం లేదని కొంత కాలంగా చెబుతున్నారు. ఇదే సమయంలో కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలని లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర హోం మంత్రి రాజనాథ్ సింగ్, ఆ శాఖ కార్యదర్శిని కలిసి రక్షణ కోరారు. కేంద్ర బలగాలతో ఇంత వరకూ రక్షణ కల్పించకపోవడంతో ఆయన ఢిల్లీ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. తనపై కొందరు బెదిరింపులకు పాల్పడుతుండటంతో […]

Written By:
  • Neelambaram
  • , Updated On : July 21, 2020 / 11:51 AM IST
    Follow us on


    నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు రాష్ట్ర ప్రభుత్వానికి కొత్త ట్విస్ట్ ఇచ్చారు. తనకు ఆంధ్రా పోలీసులపై నమ్మకం లేదని కొంత కాలంగా చెబుతున్నారు. ఇదే సమయంలో కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలని లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర హోం మంత్రి రాజనాథ్ సింగ్, ఆ శాఖ కార్యదర్శిని కలిసి రక్షణ కోరారు. కేంద్ర బలగాలతో ఇంత వరకూ రక్షణ కల్పించకపోవడంతో ఆయన ఢిల్లీ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. తనపై కొందరు బెదిరింపులకు పాల్పడుతుండటంతో కేంద్ర బలగాల భద్రత కోరినట్లు చెప్పారు. ఈ చర్య రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వం ప్రతిష్ట మరింత రచ్చకీడ్చేదిగా ఉందని ఆ పార్టీ నాయకులు విమర్శిస్తున్నారు.

    Also Read: ఆమంచి ఆధిపత్యానికి గండికొట్టిన కరణం..!

    జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న పలు నిర్ణయాలపై ఆ పార్టీ ఏంపీ రఘురామ కృష్ణంరాజు కొంత కాలంగా విమర్శలు ఎక్కుపెడుతున్నారు. కొన్ని సార్లు పరోక్షంగా ముఖ్యమంత్రిపైనా విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో ఆ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, మంత్రి ఆయనకు వ్యతిరేకంగా గళం విప్పారు. దీంతో ఆయన ఎమ్మెల్యేలను పందులు అనే విధంగా సినిమా డైలాగ్ తో విమర్శలు చేశారు. ఈ క్రమంలో ఆ పార్టీ నాయకులే పార్టీకి రాఘురామ కృష్ణంరాజు వైసీపీ వ్యతిరేకిగా మారారంటూ నిరసనలు తెలియజేసి దిష్టిబొమ్మలు దగ్దం చేశారు. గుర్తు తెలియని వ్యక్తులు సామాజిక మాద్యమాల్లో బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ అంశంపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినా పెద్దగా పట్టించుకోలేదంటూ ఎంపీ ఆరోపించారు.

    Also Read: 22న కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం..

    వైసీపీ షోకాజ్ నోటీసుతో తన విమర్శలను పక్కన పెట్టిన ఎంపీ రఘురామ కృష్ణంరాజు చట్టపరంగా, న్యాయపరంగా ఆ పార్టీని, ప్రభుత్వాన్ని ఇబ్బందులు పెట్టే దిశగా ముందుకు వెళుతున్నారు. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ… వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పేరు వినియోగించుకుంటుందని, ఆ పేరుతో తనకు షోకాజ్ నోటీసు ఇచ్చిందని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. దీంతో ఆ పేరుతో రిజిస్టర్ అయిన పార్టీ నాయకులు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీపై ఢిల్లీ హై కోర్టులో కొద్ది రోజుల కిందట పిటీషన్ దాఖలు చేశారు. మరోవైపు పలు అంశాలపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వారానికి ఓ లేఖ రాస్తూ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా తనకు కేంద్ర బలగాలతో రక్షణ కావాలని ఢిల్లీ హై కోర్టులో పిటీషన్ వేసి రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టను మరింత దిగజార్చరనే వాదనలు వినిపిస్తున్నాయి.