ఆనం సడెన్ సైలెంట్ వెనుక కారణాలేంటీ?

మాజీ మంత్రి ఆనం రాంనారాయణకు నెల్లూరు జిల్లాలో మంచి పట్టుంది. కొన్నిదశాబ్దాలపాటు నెల్లూరు జిల్లాను రాజకీయాలతో ఆనం బ్రదర్స్ శాసించారు. చంద్రబాబు, వైఎస్ హయాంలో ఓ వెలుగు వెలిగిన ఆనం రాంనారాయణ ప్రస్తుతం అంతగా యాక్టివ్ కన్పించడం లేదు. సొంత జిల్లాల్లోనే ఇప్పుడు అంతగా ప్రభావం చూపలేకపోతున్నారనే టాక్ విన్పిస్తుంది. 22న కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం.. 2019 ఎన్నికల సమయంలో ఆనం రాంనారాయణ టీడీపీని వదిలి వైసీపీలో చేరారు. వైసీపీ తరుఫున వెంకటగిరి నుంచి పోటీచేసి […]

Written By: Neelambaram, Updated On : July 21, 2020 1:03 pm
Follow us on


మాజీ మంత్రి ఆనం రాంనారాయణకు నెల్లూరు జిల్లాలో మంచి పట్టుంది. కొన్నిదశాబ్దాలపాటు నెల్లూరు జిల్లాను రాజకీయాలతో ఆనం బ్రదర్స్ శాసించారు. చంద్రబాబు, వైఎస్ హయాంలో ఓ వెలుగు వెలిగిన ఆనం రాంనారాయణ ప్రస్తుతం అంతగా యాక్టివ్ కన్పించడం లేదు. సొంత జిల్లాల్లోనే ఇప్పుడు అంతగా ప్రభావం చూపలేకపోతున్నారనే టాక్ విన్పిస్తుంది.

22న కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం..

2019 ఎన్నికల సమయంలో ఆనం రాంనారాయణ టీడీపీని వదిలి వైసీపీలో చేరారు. వైసీపీ తరుఫున వెంకటగిరి నుంచి పోటీచేసి విజయం సాధించింది. వైసీపీ పార్టీ అధికారంలోకి రావడంతో తనకు మంత్రి పదవీ దక్కుతుందని ఆనం రాంనారాయణ ఆశించారు. అయితే ఆయనకు భంగపాటు తప్పలేదు. తన కంటే ఎంతో జూనియర్లు అయిన అనిల్ కుమార్, గౌతమ్ రెడ్డిలను జగన్ తన క్యాబినెట్లోకి తీసుకోవడంతో ఆనంలో అసంతృప్తి మొదలైంది.

దీంతో వీలుచిక్కినప్పుడల్లా జగన్ సర్కార్, మంత్రులపై అక్కసు వెళ్లగక్కుతోన్నారు. తన నియోజకవర్గంలో అధికారులు అభివృద్ధికి సహకరించడం లేదనే ఆరోపణలు గుప్పిస్తున్నారు. నెల్లూరులో మాఫియా రాజ్యమేలుతోందని పరోక్షంగా మంత్రి అనిల్ కుమార్, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలపై విమర్శలు గుప్పించారు. జిల్లాలో ఇసుక అక్రమాలు, నీళ్ల దోపీడి జరుగుతుందని మూడురోజుల్లో మీడియా సమావేశంపెట్టి నిరూపిస్తానంటూ హెచ్చరించారు.

ఎమ్మెల్సీ రేసు.. నేతల్లో పెరుగుతున్న టెన్షన్..!

అయితే ఆ తర్వాత ఏం జరిగిందో ఏమోగానీ నెలరోజులైనా కూడా ఆయన మీడియా సమావేశం నిర్వహించలేదు. పార్టీ ఇమేజ్ డ్యామేజ్ చేసేలా ఆనం వ్యవహరిస్తుండటంతో అధిష్టానం సీరియస్ అయినట్లు తెలుస్తోంది. దీంతో సీఎం జగన్మోహన్ రెడ్డి పార్టీపై ఆరోపణలు చేస్తే వేటు తప్పదని ఆనంకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారనే ప్రచారం జరుగుతోంది. దీంతో ఆనం రాంనారాయణ సైలంటయ్యారని ప్రచారం జరుగుతోంది.

అయితే మరోసారి క్యాబినెట్ విస్తరణ సమయంలో తనకు మంత్రి పదవీ దక్కుతుందని రాంనారాయణ భావిస్తున్నారు. దీంతో ఆయన తానంతట తానే సైలంటయ్యారనే ఆయన అనుచరులు చెబుతోన్నారు. ఏదిఏమైనా రాంనారాయణ సడన్ గా సైలంటవడం ఆసక్తిని రేపుతోంది.

Tags