https://oktelugu.com/

సవాల్ కు సై.. రఘురామ రియాక్షన్..

ఏపీ అధికార పార్టీలో ముసలం నెలకొంది. ఇరువురు పెద్దల మధ్య పెద్ద వారే సాగుతోంది. చిన్నగా మొదలైన గొడవ చిలికిచిలికి సవాళ్లు చేసుకునే వరకు వెళ్లింది. ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విసిరిని సవాల్ ను స్వీకరిస్తున్నానని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు అన్నారు. ఎంపీ పదవికి రాజీనామా చేసి .. తిరిగి పోటీ చేయాలని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సవాల్ విసిరిన సంగతి తెలిసిందే. దీనికి రఘురామ స్పందించారు. కానీ అంతకన్నా ముందు ఒక షరతును ఆయన విధించారు. […]

Written By:
  • Srinivas
  • , Updated On : March 12, 2021 / 01:24 PM IST
    Follow us on


    ఏపీ అధికార పార్టీలో ముసలం నెలకొంది. ఇరువురు పెద్దల మధ్య పెద్ద వారే సాగుతోంది. చిన్నగా మొదలైన గొడవ చిలికిచిలికి సవాళ్లు చేసుకునే వరకు వెళ్లింది. ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విసిరిని సవాల్ ను స్వీకరిస్తున్నానని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు అన్నారు. ఎంపీ పదవికి రాజీనామా చేసి .. తిరిగి పోటీ చేయాలని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సవాల్ విసిరిన సంగతి తెలిసిందే. దీనికి రఘురామ స్పందించారు. కానీ అంతకన్నా ముందు ఒక షరతును ఆయన విధించారు.

    Also Read: ఎమ్మెల్సీ ఎన్నికల్లో కేటీఆర్ ‘ఉక్కు’ మంత్రం

    తాను రాజీనామా చేసి మళ్లీ గెలిస్తే జగన్‌ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలని హాట్ కామెంట్స్ చేశారు రఘురామ. అంతేకాదు తిరిగి ఎమ్మెల్యేలను గెలిపించుకోవాలని సూచించారు. అప్పుడు మాత్రమే తాను పెద్దిరెడ్డి సవాల్‌కు సిద్ధం అని తెలిపారు. తన కాళ్లు పట్టుకుని బతిమిలాడితే జగన్ పార్టీలో చేరానని గుర్తు చేశారు. తాను సీఎం అయితే అన్న మాటల వెనుక ఉద్దేశం ఏంటో చెప్పాలని పెద్దిరెడ్డిని అడిగారు. ఇప్పుడున్న సీఎం అసమర్థుడా? చెప్పాలని అడిగారు.

    చంద్రబాబుకు బంట్రోతుగా వ్యవహరించాల్సిన అవసరం లేదన్నారు. రాజకీయాం చంద్రబాబు తనకు ఉన్నత స్థానం కల్పించారని రఘురామ గుర్తుచేశారు. చంద్రబాబును విమర్శించే స్థాయి పెద్దిరెడ్డికి లేదని.. తన గెలుపునకు వైఎస్ విజయమ్మ.. షర్మిల.. జగన్ ఫొటోలు ఉంటే.. వ్యక్తిగత ఇమేజ్ కూడా తోడయ్యిందని అన్నారు. సీఎం జగన్‌ను తాను ఎప్పుడూ విమర్శించలేదని స్పష్టంచేశారు. ప్రభుత్వ పాలసీలను, విధానాలను, తప్పుచేస్తున్న వారిని మాత్రమే విమర్శించానని చెప్పారు.

    Also Read: స్పందిస్తే.. వేటాడేస్తరు.. సెలబ్రెటీలను భయపెడుతున్న ప్రభుత్వాలు..

    జగన్ మోహన్ రెడ్డి, మిథున్ రెడ్డి దయతో మంత్రి అయ్యావని.. ఇసుక ద్వారా ఎన్నివేల కోట్లు సంపాదిస్తున్నావో ప్రజలకు తెలుసు అని రఘురామర కృష్ణం రాజు అన్నారు. అంతకుమందు పోలవరం గురించి అమిత్ షాతో సీఎం జగన్ మాట్లాడకపోవడం ఆశ్చర్యంగా ఉందని అన్నారు. ఇదికాక ఇంకే అంశాలపై మాట్లాడారో బయటపెట్టాలని.. సీఎం అంటే పెద్ద పాలేరు.. అంటే పెద్ద పాలకుడు.. అంతే కానీ.. గ్రేట్ మ్యాన్ అనుకుంటున్నారా…? అని ప్రజల దాక్షిణ్యాలతో సీఎం అయ్యారనే వాస్తవాన్ని గుర్తుపెట్టుకోవాలని హితవు పలికారు. రాజధాని విశాఖ రావాలన్నా.. సీమ సస్యశ్యామలం కావాలన్నా.. పోలవరం అవసరం అని రఘురామ అభిప్రాయం వ్యక్తం చేశారు.

    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్