రఘురామ సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్

రఘురామ కృష్ణంరాజు కేసు మలుపు తిరుగుతోంది. కేసు సప్రీంకోర్టుకు చేరడంతో రోజుకో విధంగా పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు కేసులో సుప్రీం కోర్టు తీర్పుతో ఊరట కలిగింది. ఆయన దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్ పై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. సీఐడీ విచారణకు సహకరించాలని సూచించింది. సీఐడీ కేసులో విచారణ కొనసాగించచ్చని తేల్చింది. దీంతో రఘురామ రాజద్రోహం కేసులో మరిన్ని ఆధారాల సేకరణకు సీఐడీ రెడీ […]

Written By: Srinivas, Updated On : May 22, 2021 1:52 pm
Follow us on

రఘురామ కృష్ణంరాజు కేసు మలుపు తిరుగుతోంది. కేసు సప్రీంకోర్టుకు చేరడంతో రోజుకో విధంగా పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు కేసులో సుప్రీం కోర్టు తీర్పుతో ఊరట కలిగింది. ఆయన దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్ పై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. సీఐడీ విచారణకు సహకరించాలని సూచించింది. సీఐడీ కేసులో విచారణ కొనసాగించచ్చని తేల్చింది. దీంతో రఘురామ రాజద్రోహం కేసులో మరిన్ని ఆధారాల సేకరణకు సీఐడీ రెడీ అవుతోంది. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్ పై నిన్న విచారణ జరిపి సుప్రీంకోర్టు పలు కీలక అంశాలను పరిగణనలోకి తీసుకుంది. మరో వైపు రఘురామకు బెయిల్ ఇస్తూనే మరోవైపు సీఐడీ కస్టడీలో ఆయనకు ట్రీట్ మెంట్ లభించలేదని పేర్కొంది. రఘురామ మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వొద్దని సూచించింది.

ఏపీ సీఐడీ దాఖలు చేసిన రాజద్రోహం కేసు ఆరోపణలపై సీఐడీ విచారణకు సుప్రీంకోర్టు తీర్పు లైన్ క్లియర్ చేసింది. రాజద్రోహం ఆరోపణలు సరికాదని, తనకు బెయిల్ మంజూరు చేయాలని రఘురామ సుప్రీంకోర్టున ఆశ్రయించిన నేపథ్యంలో సీఐడీ విచారణకు బ్రేక్ పడుతుందని అందరూ భావించారు. రఘురామ ఓ వైపు బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు విచారణకు సహకరించాలని షరతు పెట్టింది. దీంతో రఘురామ సీఐడీ విచారణ ఎదుర్కోక తప్పడం లేదు.

ఆరోపణలపై క్లారిటీ లేదు
రఘురామ కృష్ణంరాజుపై సీఐడీ నమోదు చేసిన రాజద్రోహం ఆరోపణలపై సీఐడీ క్లారిటీ ఇవ్వలేదు. రఘురామ వ్యాఖ్యలపై సీఐడీ రాజద్రోహం కేసు నమోదు చేయవచ్చా లేదా అన్న అంశంపై ఎలాంటి క్లారిటీ ఇవ్వకపోయినా దర్యాప్తు కొనసాగించవ్చని చెప్పడం ద్వారా సీఐడీని సమర్థించింది. దీంతో రఘురామపై మోపిన అభియోగాలపై ఆధారాలు సేకరించేందుకు ప్రయత్నిస్తోంది. ప్రస్తుతానికి రఘురామ వ్యాఖ్యలే ఆధారంగా ఉన్నందున వీటికి మద్దతుగా ఫోన్ కాల్స్, ఇతర ఆధారాల సేకరణకు ప్రయత్నిస్తోంది.

రఘురామ కృష్ణంరాజుపై సీఐడీ మోపిన రాజద్రోహం ఆరోపణలపై సీఐడీ దర్యాప్తుకు సుప్రీంకోర్టు అభ్యంతరాలు చెప్పకపోవడంతో రఘురామ సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈమేరకు ఆయన కుటుంబ సభ్యులు త్వరలో సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నారు. దీంతో కేసు ఎటు వైపు తిరుగుతుందోనని అందరు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.