వైసీపీ, వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు వ్యవహారంలో రఘురామదే పైచేయిగా మారుతోంది. ఎన్ని సంకెళ్లు విధించినా అధికార పార్టీ వైసీపీ పాచికలు పారడం లేదు. దీంతో రఘురామ మరో మెట్టు ఎక్కి వైసీపీని ఎక్కిరిస్తున్నారు. తన విజయానికి వైసీపీ ప్రధాన కారణమవుతోందని ఆయనలో స్పందన వస్తోంది. ఈ నేపథ్యంలో వైసీపీ తల పట్టుకుంటోంది. రఘురామ పీడ ఎలా పోయేదని చిన్నాభిన్నం అవుతోంది వైసీపీ. అధికారంలో ఉండి కూడా రఘురామ ఆగడాలను అడ్డుకోలేకపోతోంది. దీంతో రఘురామ రోజురోజుకు విజయాలు సాధిస్తుండడంతో వైసీపీలో అంతర్మథనం మొదలైంది.
సీఎం జగన్, రెబల్ ఎంపీ రఘురామపై రెండేళ్లుగా పోరాడుతూనే ఉన్నారు. కానీ ప్రతిసారి రఘురామ చేతిలో ఓటమి పాలవుతూనే ఉంది. ఇప్పటికే రఘురామపై అనర్హత వేటువేయించాలని భావించి పార్లమెంట్ వేదికగా నోటీసు ఇప్పించినా అది విఫలమే అయింది. ఫలితంగా వైసీపీ అభాసుపాలైంది. ఈ నేపథ్యంలో రఘురామపై ఒక్క విషయంలో మాత్రం వైసీపీ నెగ్గింది. ఆయనపై రాజద్రోహం కేసు పెట్టి అరెస్టు చేయించడంలో మాత్రం వైసీపీ సక్సెస్ అయింది తప్ప మిగతా విషయాల్లో మాత్రం ఓటమే వెక్కిరించింది.
దీంతో రఘురామ సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ ను లక్ష్యంగా చేసుకుని పోరాటం మొదలు పెట్టారు. సునీల్ కుమార్ వ్యక్తిగత జీవితంపై ఆరా తీశారు. ఆయనకు ఓ రెండు పాయింట్లు దొరికాయి. దీంతో సునీల్ కుమార్ పై చర్యలు తీసుకోవాలని హోం శాఖకే ఫిర్యాదు చేశారు. ఆయనపై గతంలో నమోదైన వరకట్నం కేసును ఎందుకు వదిలేశారని ప్రశ్నించారు. దీంతో నేరుగా సునీల్ కుమార్ పై చర్యలు తీసుకోవాలని వైసీపీని ఆదేశిస్తూ ఏపీ ప్రభుత్వానికి హోం శాఖ లేఖలు రాసింది. దీంతో పీవీ సునీల్ కుమార్ పై రఘురామ విజయం సాధించినట్లే అని తెలుస్తోంది.
వరకట్న వేధింపుల కేసులో ముద్దాయిగా ఉన్న సునీల్ కుమార్ కోర్టుకు వెళ్లకుండా మినహాయింపు తెచ్చుకున్నట్లు తెలుస్తోంది. దీంతో నిందితుడుగా ఉన్న సునీల్ కుమార్ కు సీఐడీ చీఫ్ పదవి బాధ్యతలు ఎలా ఇస్తారని రఘురామ ప్రశ్నిస్తున్నారు. దీంతో ఆయనను పదవి నుంచి తొలగించాలని కోరారు. ఈ నేపథ్యంలో కేంద్ర హోం శాఖ అండర్ సెక్రటరీ సంజీవ్ కుమార్, ఏపీ సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ కు ఈ మేరకు పీవీ సునీల్ కుమార్ పై చర్యలు తీసుకోవాలని లేఖ రాసింది. దీంతో జగన్ సర్కారు ఇరుకున పడింది.
జగన్ సర్కారుతో రఘురామ సాగిస్తున్న పోరులో విజయం సాధిస్తున్న పలు అంశాల్లో ఇప్పుడు కీలకమైన సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ విషయం ప్రాధాన్యం సంతరించుకుంది. ఢిల్లీలో రఘురామ చేస్తున్న లాబీయింగ్ లో పలుమార్లు విజయం సాధించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా కేంద్రం తీసుకున్న నిర్ణయం కలకలం రేపుతోంది. సునీల్ కుమార్ పై చర్యలు తీసుకోవాలని హోం శాఖ నుంచి ఆదేశాలు జారీ చేయించడంలో విజయం సాధించిన రఘురామ వ్యవహారంలో సీఎం జగన్ ఏ మేరకు నిర్ణయాలు తీసుకుంటారో అని అనుమానిస్తున్నారు.