రఘురామ-లోకేష్ ల ఆడియో గుట్టురట్టు.. ఏపీలో సంచలనం

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు, వైసీపీ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. రఘురామపై అనర్హత వేటు వేయాలని స్పీకర్ ఓం బిర్లాకు ఫిర్యాదు చేయడంతో ఆయనపై చర్యలకు స్పీకర్ ఆదేశించడంతో విషయం మరో మలుపు తిరిగింది. రఘురామపై ప్రభుత్వం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన కౌంటర్ అఫిడవిట్ లో పలు సంచలన విషయాలు పేర్కొంది. ఇప్పటికే ఆ అఫిడవిట్ లోని అంశాలు బయటకు వస్తున్నాయి. సీఎం జగన్ బెయిల్ రద్దు పిటిషన్ వ్యవహారంలో రఘురామరాజు చంద్రబాబు మధ్య […]

Written By: Srinivas, Updated On : July 21, 2021 2:18 pm
Follow us on

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు, వైసీపీ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. రఘురామపై అనర్హత వేటు వేయాలని స్పీకర్ ఓం బిర్లాకు ఫిర్యాదు చేయడంతో ఆయనపై చర్యలకు స్పీకర్ ఆదేశించడంతో విషయం మరో మలుపు తిరిగింది. రఘురామపై ప్రభుత్వం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన కౌంటర్ అఫిడవిట్ లో పలు సంచలన విషయాలు పేర్కొంది. ఇప్పటికే ఆ అఫిడవిట్ లోని అంశాలు బయటకు వస్తున్నాయి. సీఎం జగన్ బెయిల్ రద్దు పిటిషన్ వ్యవహారంలో రఘురామరాజు చంద్రబాబు మధ్య సాగిన చాటింగ్ గురించి సీఐడీ పేర్కొన్న అంశాలను ప్రచురించిన జగన్ కుటుంబ సభ్యుల మీడియా, తాజాగా రఘురామ రాజు లోకేష్ మధ్య సాగిన కోర్టు వ్యవహారాల చాటింగ్ ను బయటపెట్టింది.

అందులో న్యాయస్థానాలు,న్యాయమూర్తులకు దురుద్దేశాలు ఆపాదిస్తూ అసభ్య పదజాలంతో కూడిన వ్యాఖ్యలు చాటింగ్ లో ఉన్నట్లుగా పేర్కొంది. ఆ కథనం ప్రకారం ఏప్రిల్ 30న హైకోర్టులో కేసు విచరాణను ఆన్ లైన్ వీక్షిస్తూ వీరిద్దరూ చాటింగ్ చేసినట్లు వివరించారు. ఆ సమయంలో రఘురామ కోర్టు విచారణలో మీకు అంతా మంచే జరుగుతుంది అంటూ అవసరమైతే మనం సుప్రీంలో హౌస్ మోషన్ చేసేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు.

చీఫ్ జస్టిస్ మన సీనియర్ న్యాయవాది వాదనకు అనుకూలంగా ఉన్నట్లు కనిపిస్తోందని రఘురామ చెప్పగా న్యాయమూర్తి పరీక్షలు నిర్వహించాలనే ఉద్దేశంతో ఉన్నట్టుగా ఉన్నారని లోకేష్ కామెంట్ చేశారు. దీనికి కొనసాగింపుగా నాటి సీజే ప్రవీణ్ ను పంపించి వేయాలి అంటూ రఘురామ కామెంట్ చేసినట్లుగా వివరించారు. ఆ కేసులో వాదనలకు అనుగుణంగా రఘురామ లోకేష్ మధ్య చాటింగ్ కొనసాగింది. దీన్ని సీఐడీ పోలీసులు స్వాధీనం చేసుకున్న సెల్ ఫోన్ ఆధారంగా సేకరించినట్లుగా చెబుుతున్నారు.

ఆకేసులో లోకేష్ కు రఘురామ ముందస్తు గ్రీటింగ్స్ కూడా చెప్పినట్లుగా వివరించారు. ఇప్పటికే సీఎం జగన్ బెయిల్ రద్దు పిటిషన్ ను రఘురామ టీడీపీ అధినేత కు షేర్ చేశారని వారిద్దరి మధ్య జరిగిన సంబాషణను నిన్ననే బయటపెట్టారు. రాష్ర్టంలో ఇప్పుడు రఘురామ సెల్ పోన్ లో చంద్రబాబు-లోకేష్ తోజరిగిన చాటింగ్ అంశాలు రాజకీయంగా దుమారానికి కారణమవుతున్నాయి. ఇప్పుడు చాటింగ్ కు సంబంధించిన ఆధారాలు సీఐడీ సిద్ధం చేసిందని తెలుస్తోంది.