https://oktelugu.com/

ఏంటి ఇది.. సీరియస్ అయిన మహేష్ బాబు

సూపర్ స్టార్ మహేష్ బాబు సీరియస్ అయ్యారు. తన తాజా చిత్రం షూటింగ్ సందర్భంగా ఆయన అసహనం వ్యక్తం చేసినట్టు టాలీవుడ్ సమాచారం. ఈ మేరకు గట్టి వార్నింగ్ కూడా ఇచ్చినట్టు తెలుస్తోంది. మహేష్ ఆగ్రహించడంతో ఇప్పుడు సినిమా షూటింగ్ లో మొత్తం రూల్స్ అన్నీ మారిపోయాయట.. మహేష్ బాబు హీరోగా రాబోతున్న ‘సర్కారివారిపాట’ సినిమాను లీకుల బెడద కలవరపరుస్తోంది. పలు జాగ్రత్తలతో షూటింగ్ చేస్తున్నా లీకులు మాత్రం జరుగుతూనే ఉంటున్నాయి. దీనిపై మహేష్ బాబు సీరియస్ […]

Written By: , Updated On : July 21, 2021 / 02:14 PM IST
Follow us on

Sarkaru Vaari Paata Stills Leak

సూపర్ స్టార్ మహేష్ బాబు సీరియస్ అయ్యారు. తన తాజా చిత్రం షూటింగ్ సందర్భంగా ఆయన అసహనం వ్యక్తం చేసినట్టు టాలీవుడ్ సమాచారం. ఈ మేరకు గట్టి వార్నింగ్ కూడా ఇచ్చినట్టు తెలుస్తోంది. మహేష్ ఆగ్రహించడంతో ఇప్పుడు సినిమా షూటింగ్ లో మొత్తం రూల్స్ అన్నీ మారిపోయాయట..

మహేష్ బాబు హీరోగా రాబోతున్న ‘సర్కారివారిపాట’ సినిమాను లీకుల బెడద కలవరపరుస్తోంది. పలు జాగ్రత్తలతో షూటింగ్ చేస్తున్నా లీకులు మాత్రం జరుగుతూనే ఉంటున్నాయి. దీనిపై మహేష్ బాబు సీరియస్ అయ్యాడట..

ఇప్పటికే దుబాయ్ లో జరిగిన షూటింగ్ స్టిల్స్ లీక్ అయ్యి సినిమాకు మైనస్ గా మారిందట.. ఇక ఇటీవల షూటింగ్ స్టిల్స్, వీడియోస్ కూడా బయటకొచ్చాయట.. ప్రతి ఒక్కరి చేతిలో హఎండ్ స్మార్ట్ ఫోన్ ఉండడంతో ఏదో ఒక రూపంలో షూటింగ్ స్టిల్స్, వీడియోస్ బయటకు వస్తున్నాయి.

ఈ క్రమంలోనే ‘సర్కారివారిపాట’ సినిమా చేస్తున్న మహేష్ బాబు చిత్రం యూనిట్ పై సీరియస్ అయినట్టు తెలుస్తోంది. దర్శక, నిర్మాతలు పలు జాగ్రత్తలతో షూటింగ్ చేస్దున్నా లీకులు జరుగుతూనే ఉన్నాయి. అయితే ఈ లీకుల వ్యవహారం తెలిసి నిరాశ చెందిన మహేష్ బాబు చిత్రయూనిట్ పై సీరియస్ అయినట్లు సమాచారం.

దీంతో తాజాగా చిత్రం యూనిట్ లోని అందరూ ఫోన్లను షూటింగ్ లోకేషన్ కు తీసుకురావద్దని దర్శకుడు పరుశురాం హుకూం జారీ చేశారట.. ఈ మేరకు డైరెక్టర్ పరశురాం రూల్ పాస్ చేశాడని తెలుస్తోంది.

బ్యాంకింగ్ మోసాల బ్యాక్ డ్రాప్‌లో జరిగే కథాంశమని సమాచారం. ప్రీలుక్‌లో మహేశ్ మెడపై రూపాయి టాటూను చూస్తే అది నిజమే అనిపిస్తోంది. ఈ మధ్య కాలంలో బ్యాంకింగ్‌ మోసాలు ప్రపంచ వ్యాప్తంగా పెద్ద సమస్యగా మారిన సంగతి తెలిసిందే. అలా తమ కుటుంబాన్ని మోసం చేసిన వారిపై ప్రతీకారం తీర్చుకునే క్యారెక్టర్లో మహేశ్ కనిపిస్తాడని తెలుస్తోంది. ఈ మూవీకి సంబంధించిన మరో ఆసక్తికర విషయం ఏంటంటే హీరోయిన్‌ కాసినోలలో జూదం ఆడుతుందట. కీర్తి సురేష్ ను ఈ సినిమాకు గాను హీరోయిన్ గా పెట్టుకున్నారు.