https://oktelugu.com/

రఘరామ ఢిల్లీకి పయనం.. రహస్యం అదేనా?

ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎంపీ రఘురామరాజు సడెన్లీగా ఢిల్లీకి వెళ్లారు. చెప్పా పెట్టకుండా ఢిల్లీ వెళ్లడంపై అటు ఏపీ ప్రభుత్వంతో పాటు ప్రజల్లోనూ ఆశ్చర్యాన్ని కలిగించింది. తనను పోలీసులు కొట్టారని, దీంతో తాను చికిత్స తీసుకోవాలని సుప్రీం కోర్టు నుంచి ఆదేశాలు తెచ్చుకున్న ఎంపీ సికింద్రాబాద్ లోని ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. అయితే గత వారమే ఆసుపత్రి నుంచి డిశ్చార్జీ కావాల్సిన ఆయన తనకు ఇతర ఆనారోగ్య సమస్యలున్నాయని తెలపడంతో మరో నాలుగు రోజులు […]

Written By:
  • NARESH
  • , Updated On : May 27, 2021 3:32 pm
    Follow us on

    MP Raghuram

    ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎంపీ రఘురామరాజు సడెన్లీగా ఢిల్లీకి వెళ్లారు. చెప్పా పెట్టకుండా ఢిల్లీ వెళ్లడంపై అటు ఏపీ ప్రభుత్వంతో పాటు ప్రజల్లోనూ ఆశ్చర్యాన్ని కలిగించింది. తనను పోలీసులు కొట్టారని, దీంతో తాను చికిత్స తీసుకోవాలని సుప్రీం కోర్టు నుంచి ఆదేశాలు తెచ్చుకున్న ఎంపీ సికింద్రాబాద్ లోని ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. అయితే గత వారమే ఆసుపత్రి నుంచి డిశ్చార్జీ కావాల్సిన ఆయన తనకు ఇతర ఆనారోగ్య సమస్యలున్నాయని తెలపడంతో మరో నాలుగు రోజులు అవకాశం ఇచ్చింది. అంటే వచ్చే సోమవారం ఆయన డిశ్చార్జీ కావాలి. కానీయ ఆయన బుధవారం హూటా హుటిన ఢిల్లీ వెళ్లారు.. అందుకు కారణాలేంటో ఇప్పుడు చూద్దాం..

    నర్సాపురం ఎంపీ అరెస్టు నుంచి ఇప్పటి వరకు అన్నీ నాటకీయ పరిణామాలే సాగుతున్నాయి. ఆయన ఆరెస్టయిన రోజు తనను పోలీసులు తీవ్రంగా కొట్టారని మీడియాకు తన కాళ్లను పైకి లేపి చూపించారు. దీంతో ఎంపీ అని చూడకుండా తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారని ఆయన తరుపున న్యాయవాదులు హైకోర్టులో పిటిషన్ వేశారు. అయితే సీఐడీ పోలీసులు ఆ ఆదేశాలను పట్టించుకోకపోవడంతో సుప్రీం కోర్టును సంప్రదించారు. దీంతో సుప్రీం ఆదేశాలతో ఆయన సికింద్రాబాద్ లోని ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

    అయితే ఒక్కసారిగా ఆయన ఆసుపత్రి నుంచి డిశ్చార్జీ అయి ఢిల్లీ వెళ్లారు. అయితే ఢిల్లీ ఎందుకు వెళ్లారోనన్న ఆసక్తి చర్చ జోరుగా సాగుతోంది. అయితే ఎంపీ తరుపున న్యాయవాదులు మాత్రం డిశ్చార్జీ సమ్మరితో పాటు బెయిల్ బాండ్లను గుంటూరు కోర్టులో సమర్పిస్తామని చెప్పారు. అయితే ఢిల్లీకి వెళ్లడంపై రకరకాల ప్రచారం జరుగుతోంది. అయితే సికింద్రాబాద్ లో ఉంటే ఏ క్షణాన్నైనా తనను అరెస్టు చేసే అవకాశం ఉంటుంది గనుక ఢిల్లీ అయితే సేఫ్ అని ఆలోచించినట్లు తెలుస్తోంది.

    ఢిల్లీలో తనకు కావాల్సిన వైద్యం చేయించుకోవచ్చని, అవసరమైనప్పుడల్లా ఆసుపత్రికి వెళ్లొచ్చునన్న ఎంపీ అనుకున్నారని అంటున్నారు. అంతేకాకుండా ఢిల్లీలో పలువురు పెద్దలను కలిసి తన కేసు గురించి మాట్లాడే అవకాశం ఉంటుందని, తద్వారా కోర్టు నుంచి లేదా ఇతర మార్గాల ద్వారా తనకు అనుకూలంగా మార్చుకోవచ్చని రఘురామ ప్లాన్ వేశారని అంటున్నారు. అందుకు ఢిల్లీ వెళ్లారని అంటున్నారు.