Ragging: విద్యార్థి బట్టలూడదీసి.. మెడికల్ కాలేజీలో ర్యాంగింగ్ దుమారం

Ragging: ర్యాగింగ్ భూతం పేరు ఇప్పుడు తెలంగాణ‌లో హాట్ టాపిక్ గా మారింది. చాలా ఏండ్ల త‌ర్వాత ర్యాగింగ్ పేరు ఇప్పుడు తెలంగాణ‌లో పెను దుమారం రేపుతోంది. సూర్యపేట జిల్లాలోని ఓ మెడిక‌ల్ కాలేజీలో ర్యాగింగ్ చేశార‌నే వార్త‌లు రాష్ట్రాన్ని కుదిపేస్తున్నాయి. ఈ జిల్లాలోని మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ ఫ‌స్ట్ ఇయ‌ర్ చ‌దువుతున్న‌టువంటి స్టూడెంట్ ను సీనియ‌ర్ స్టూడెంట్లు ర్యాగింగ్ చేశారు. అది కూడా అర్ధ‌రాత్రి స‌మ‌యంలో. బాధిత స్టూడెంట్ ఒంటి మీద నూలు పోగు కూడా […]

Written By: Mallesh, Updated On : January 3, 2022 6:10 pm
Follow us on

Ragging: ర్యాగింగ్ భూతం పేరు ఇప్పుడు తెలంగాణ‌లో హాట్ టాపిక్ గా మారింది. చాలా ఏండ్ల త‌ర్వాత ర్యాగింగ్ పేరు ఇప్పుడు తెలంగాణ‌లో పెను దుమారం రేపుతోంది. సూర్యపేట జిల్లాలోని ఓ మెడిక‌ల్ కాలేజీలో ర్యాగింగ్ చేశార‌నే వార్త‌లు రాష్ట్రాన్ని కుదిపేస్తున్నాయి. ఈ జిల్లాలోని మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ ఫ‌స్ట్ ఇయ‌ర్ చ‌దువుతున్న‌టువంటి స్టూడెంట్ ను సీనియ‌ర్ స్టూడెంట్లు ర్యాగింగ్ చేశారు. అది కూడా అర్ధ‌రాత్రి స‌మ‌యంలో.

బాధిత స్టూడెంట్ ఒంటి మీద నూలు పోగు కూడా లేకుండా బ‌ట్ట‌లు మొత్తం విప్పించి బలవంతంగా ఫొటోలు తీశారు. అంతే కాకుండా ఆ స్టూడెంట్ జుట్టును కత్తిరించినట్టు స‌మాచారం. అయితే వారి చేష్ట‌ల‌తో భ‌య‌ప‌డ్డ ఆ బాధిత స్టూడెంట్ హైదరాబాద్‌లోని పేరెంట్స్‌కు జ‌రిగింది ఫోన్ చేసి చెప్పాడు. దీంతో వారు పోలీసుల‌కు స‌మాచారం ఇచ్చారు. అప్ప‌టిక‌ప్పుడు పోలీసులు వెళ్లి ఆ స్టూడెంట్ ను కాపాడారు. ఈ ర్యాగింగ్ లో 25 మంది సీనియర్ స్టూడెంట్లు ఉన్న‌ట్టు పోలీసులు తెలిపారు. వారంద‌రి మీద కేసులు న‌మోదు చేశారు.

Ragging

అయితే ఈ ర్యాగింగ్ కేసు మీద హెల్త్ మినిస్ట‌ర్ హరీష్‌రావు ఫుల్ సీరియ‌స్ అయ్యారు. ఘ‌ట‌న‌కు పాల్ప‌డ్డ వారి మీద క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని చెప్పారు. భ‌విష్య‌త్ లో ఇలాంటి ఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌కుండా చూస్తామ‌ని, అందుకోసం అన్ని విధాలుగా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని వెల్ల‌డించారు. ఈ విష‌యంలో ఇప్ప‌టికే డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్‌ను కూడా అలెర్ట్ చేసిన‌ట్టు వెల్ల‌డించారు.

Also Read:  సాంగ్ అదిరింది.. రెజీనా, మెగాస్టార్ పోటీ పడి స్టెప్పులేశారు !

ఇక ర్యాగింగ్ ఘ‌ట‌న మీద సోమవారం మధ్యాహ్నం లోపు త‌న‌కు పూర్తి నివేదిక ఇవ్వాలంటూ హ‌రీశ్ రావు ఆదేశించారు. ర్యాగింగ్ ఆరోప‌న‌లు నిరూప‌ణ అయితే వారి మీద క‌ఠినంగా చ‌ర్య‌లుంటాయ‌ని హెచ్చ‌రించారు. కాగా బంజారాహిల్స్ లో ఓ పీహెచ్ సీలో 15 నుంచి 18 ఏళ్ల లోపు ఉన్న పిల్ల‌ల‌కు టీకాల‌ను ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ర్యాగింగ్ ఘ‌ట‌న మీద స్పందించారు. కాగా ఈ వార్త ఇప్పుడు సంచ‌ల‌నం రేపుతోంది.

Also Read: మొద‌ట్లో చిరంజీవికి వీరాభిమాని.. క‌ట్ చేస్తే మెగాస్టార్ కే బంపర్ హిట్లు ఇచ్చిన స్టార్ డైరెక్టర్..

Tags