
తెలంగాణలో వర్షాలు పడుతున్నాయి. నైరుతి రుతుపవనాల ప్రభావంతో రాష్ర్టమంతా వానలు కురుస్తున్నాయి. ఉపరితల ద్రోణి ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో వచ్చే రెండు మూడు రోజులలో సమృద్ధిగా కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఏపీలో పశ్చిమ, నైరుతి దిశల నుంచి గాలులు వీస్తాయని తెలిపారు. తెలంగాణలోనూ పశ్చిమ , వాయువ్య దిశల నుంచి కిందిస్థాయి గాలులు వీస్తాయని పేర్కొన్నారు.
ప్రస్తుతం ఉపరితల ద్రోణి బలహీనపడిందని వివరించారు. ఏపీలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు తెలియజేశారు. ఉత్తర కోస్తా, యానాం ప్రాంతాల్లో కొన్ని చోట్ల శని, ాది, సోమ వారాల్లో (3,4,5 తేదీల్లో ) ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. దక్షిణ కోస్తాలో శని, ఆది, సోమ వారాలు (3,4,5 తేదీల్లో) దక్షిణ కోస్తాంధ్రలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం పడే సూచనలున్నాయి.
రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో ఆదివారం మెరుపులతో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం పడే అవకాశముంది. మరికొన్ని చోట్ల భారీ వర్షం కురిస్తుందని తెలిపారు. ఎల్లుండి ఉరుములు మెరుపులతో పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని చెప్పారు. తెలంగాణలోనూ ఇదే రకమైన వాతావరణ పరిస్థితులు కొనసాగుతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
ఆదివారం తెలంగాణ రాష్ర్టంలో పశ్చిమ, వాయువ్య దిశల నుంచి కిందిస్థాయి గాలులు వీస్తాయని పేర్కొన్నారరు. తెలంగాణ పరిసర ప్రాంతాల్లో విస్తరించిన ఉపరితల ద్రోణి బలహీనపడిందని వివరించారు. ఈ ఉపరితల ద్రోణి ప్రభావంతో ఆదివారం రాష్ర్టంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు పడే అకాశం ఉందని తెలిపారు. తెలంగాణలోని ఒకటి రెండు ప్రాంతాల్లో సోమవారం ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.