
కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలలో ఒకటైన లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్స్ సెంటర్ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. 160 అప్రెంటీస్ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ ను విడుదల చేసింది. విడుదలైన నోటిఫికేషన్ లో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్, టెక్నీషియన్ (డిప్లొమా) అప్రెంటిస్ ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. గ్రాడ్యుయేట్, డిప్లొమా చేసిన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎవరైతే ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికవుతారో వారు కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురంలో పని చేయాల్సి ఉంటుంది. http://boat-srp.com/ వెబ్ సైట్ ద్వారా అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. మొత్తం 160 ఖాళీలలో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ 73 ఖాళీలు ఉండగా డిప్లొమా అప్రెంటిస్ 87 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి.
గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ ఉద్యోగాలలో మెకానికల్ ఇంజినీరింగ్ 40, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ 7, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ 8, ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్ 2, కెమికల్ ఇంజినీరింగ్ 1, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ 5, సివిల్ ఇంజినీరింగ్ 4, లైబ్రెరీ సైన్స్ 6 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. డిప్లొమా అప్రెంటిస్ 87 ఉద్యోగ ఖాళీలు ఉండగా మెకానికల్ ఇంజినీరింగ్ 53, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ 7, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ 4, సివిల్ ఇంజినీరింగ్ 6 ఉద్యోగ ఖాళీలున్నాయి.
కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ ఉద్యోగ ఖాళీలు 5 ఉండగా ఆటోమొబైల్ ఇంజినీరింగ్ 2 ఉద్యోగ ఖాళీలు, కెమికల్ ఇంజినీరింగ్ ఒక ఉద్యోగ ఖాళీ ఉంది. సంబంధిత ట్రేడ్‌లో ఇంజినీరింగ్, డిప్లొమా ఫస్ట్ క్లాస్ లో పాసైన వాళ్లు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవాలి. శిక్షణ కాలం ఏడాది కాగా అకడమిక్ ఇయర్‌లో వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. మార్కుల ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులను శిక్షణకు ఎంపిక చేయడం జరుగుతుంది.
http://boat-srp.com/ వెబ్ సైట్ ద్వారా ఉద్యోగ ఖాళీలకు సంబంధించి ఎలాంటి సందేహాలు ఉన్నా సులభంగా నివృత్తి చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి అర్హతకు తగిన వేతనం లభిస్తుంది.