ఈ మధ్య కాలంలో కొత్త కొత్త వైరస్ లు వెలుగులోకి వస్తూ ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నాయి. సార్స్, ఎబోలా, కరోనా వైరస్ లు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. రాబోయే రోజుల్లో మరిన్ని కొత్త వైరస్ లు వచ్చే అవకాశాలు సైతం ఉన్నాయి. జలుబు, డెంగీ, ఫ్లూ బారిన పడటానికి కూడా వైరస్ లే కారణమనే సంగతి తెలిసిందే. ఇమ్యూనిటీ పవర్ ను పెంచే ఆహారాన్ని తీసుకోవడం ద్వారా, కొన్ని ఔషధ మొక్కల ద్వారా వైరస్ బారిన పడకుండా మనల్ని మనం రక్షించుకునే అవకాశాలు అయితే ఉంటాయి.
తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఇమ్యూనిటీ పవర్ ను పెంచుకుంటే మాత్రమే వైరస్ ల బారిన పడకుండా మనల్ని మనం రక్షించుకునే అవకాశాలు అయితే ఉంటాయి. అందుకోసం సహజంగా లభ్యమయ్యే ఔషధ మొక్కలను ఏదో ఒక విధంగా తీసుకుంటే మంచిదని నిపుణులు చెబుతుండటం గమనార్హం. తులసి ఆకుల్లో శరీరానికి అవసరమైన విటమిన్లతో పాటు ఖనిజాలు కూడా ఉంటాయి. తులసి ఆకులను కషాయం లేదా టీ రూపంలో తీసుకుంటే మంచిదని నిపుణులు చెబుతుండటం గమనార్హం.
తిన్న ఆహారం జీర్ణం కావడానికి, నోటి సువాసన కొరకు సోంపు గింజలను మనం తీసుకుంటామనే సంగతి తెలిసిందే. ఆస్తమా, బ్రాంకైటిస్ తో పాటు ఇతర వ్యాధులకు చెక్ పెట్టడంలో సోంపు సహాయపడుతుంది. కరోనా నుంచి కోలుకున్న తర్వాత తలెత్తే సమస్యలకు సోంపు మంచి మందు అని చెప్పవచ్చు. సోంపు ఆకలిని తగ్గిస్తుంది కాబట్టి ఊబకాయులు సైతం సోంపును తీసుకుంటే మంచిదని చెప్పవచ్చు.
మెదడును ఆరోగ్యంగా ఉంచే దివ్యౌషధాలలో సేజ్ ఒకటి. సేజ్ ఆకులను తీసుకుంటే కండరాల ఆరోగ్యం కూడా బాగుంటుంది. క్రిమికీటకాలను నశింపజేయడంలో సేజ్ తోడ్పడుతుంది. అజీర్తిని తగ్గించడంతో పాటు మెదడు పనితీరును మెరుగుపరచడంలో తోడ్పడుతుంది. దగ్గు, తలనొప్పిలకు చెక్ పెట్టడంలో లెమన్ బామ్ ఉపయోగపడుతుంది. లెమన్ బామ్ యాంటీ వైరల్ గుణాలను కలిగి ఉంటుంది. లెమన్ బామ్ అల్జీమర్స్ కు చెక్ పెట్టడంలో తోడ్పడుతుంది. కరివేపాకు, తిప్పతీగ, వేప సైతం వ్యాధులను అడ్డుకోవడంలో ఎంతగానో తోడ్పడతాయి.