Queen Elizabeth II: మనదేశ చరిత్రలో స్వాతంత్ర్య పోరాటం గురించి అందరికి తెలిసే ఉంటుంది. ఇందులో 1919లో జరిగిన జలియన్ వాలాబాగ్ సంఘటన ప్రజల్లో ఎంతటి ఆగ్రహాన్ని కలిగించిందో మనకు విధితమే. మనకు చేదు అనుభవాన్ని మిగిల్చిన అత్యంత హేయమైన ఘటనగా దీనికి పేరు. దీంతో ఆంగ్లేయుల తీరుకు దేశవ్యాప్తంగా ఆందోళనలు చెలరేగాయి. దాదాపు 1500 మంది ఆత్మార్పణ, 1200 మంది గాయాల పాలు కావడం నిజంగా దురదృష్టమే. దీనిపై ప్రజల్లో ఆవేశం రావడం మామూలే. మనకు బ్రిటిష్ వారు కలిగించిన నష్టాల్లో ముఖ్యమైనది ఇదే కావడం గమనార్హం.

బ్రిటిష్ వారు చేసిన దరాగాతానికి రాణి ఎలిజబెత్ క్షమాపణలు చెప్పడం మనకు ఆశ్చర్యం కలిగించింది. బ్రిటిష్ పాలకుల నియంతృత్వ ధోరణితోనే ప్రజలు చాలా ఇబ్బందులకు గురయ్యారు. దీన్ని అర్థం చేసుకున్న రాణి మనకు సారీ చెప్పడంతో భారతీయులు రాణి పట్ల ఎంతో గౌరవం చూపించారు. తమ దమనకాండకు దృష్టాంతమే జలియన్ వాలాబాగ్ సంఘటన అని ఆమె గుర్తు చేసుకుని మరీ బాధ పడటం అందరిని కలచివేసింది. రాణి పెద్ద మనసుకు అందరు ఫిదా అయ్యారు. అది ఆమెలోని గొప్పదనం అని పొగిడారు.
భారత స్వర్ణోత్సవాల సందర్భంగా 1997లో భారత్ కు విచ్చేసిన రాణి ఎలిజబెత్ తన పర్యటనలో జలియన్ వాలాబాగ్ ను సందర్శించాలని అనుకోవడంతో దేశవ్యాప్తంగా నిరసన జ్వాలలు రేగాయి. కానీ ఆమె మాత్రం జలియన్ వాలాబాగ్ ను సందర్శించి అక్కడ చనిపోయిన వారికి నివాళి అర్పించి తన గొప్ప మనసును చాటుకుంది. చెప్పులు విడిచి తన మంచితనాన్ని ప్రదర్శించి అందరిలో గొప్ప వ్యక్తిగా ముద్ర వేయించుకున్నారు. స్వాతంత్ర్య పోరాటం నాటి గుర్తులను తలుచుకుని బాధ వ్యక్తం చేయడం గమనార్హం.

ఎలిజబెత్ కాషాయ వస్త్రాలు ధరించి అమరవీరుల స్మృతుల ముందు పుష్పగుచ్చాలు ఉంచి మౌనాన్ని పాటించారు. 2013లో బ్రిటన్ ప్రధాని డేవిడ్ కేమరూన్ స్వర్ణోత్సవాల వేళ బ్రిటిష్ రాణి ఎలిజబెత్ చేసిన ప్రసంగాన్ని తలుచుకుని ఆమె చేసిన దాన్ని సమర్థించారు. భారతీయుల బాధలకు తామే కారణమని పరోక్షంగా ఒప్పుకున్నారు. మీకు తలవంపులు తెచ్చినందుకు క్షమించండని వేడుకోవడం సంచలనం కలిగించింది. స్వాతంత్ర్య పోరాట సమయంలో మనపై బ్రిటిష్ వారు చేసిన దారుణాలకు ఎలిజబెత్ స్వయంగా తానే సారీ చెప్పడం ఆమె హుందాతనానికి నిదర్శనంగా మారింది.