Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంట్లో వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మహేష్ బాబు పెద్దగా గుడులు, గోపురాలకు తిరిగినట్టు కనిపించరు. కానీ ఆయన భార్య నమ్రత మాత్రం మొక్కులు తీర్చుకుంటారు. తిరుపతికి వెళ్లి గుండు కూడా గీయించుకున్నారు. వ్రతాలు, నోములు అంటూ ఎప్పుడూ మన సంప్రదాయాలు పాటిస్తుంటారు.

ఈ గణపతి నవరాత్రులను కూడా మహేష్ బాబు ఇంట్లో వేడుకలా నిర్వహించింది నమ్రత.. ఈ నవరాత్రులు నిష్టతో గణపతిని కొలిచింది. ప్రతీరోజు నమ్రతనే పూజ చేసేది. ఇక నిమజ్జనం రోజున మహేష్ ఇంట్లోని వినాయకుడికి పూజలు చేశారు నమ్రత, సితార, గౌతమ్. ముగ్గురూ కలిసి నిమజ్జన వేడుకలు కూడా నిర్వహించారు.
మహేష్ బాబు కుమారుడు గౌతమ్ గణపతిని ఇంట్లోంచి బయటకు తీసి స్వయంగా నిమజ్జన ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఆ తర్వాత గణపతిని సమీప చెరువుల్లో నిమజ్జనం చేశారు.

ఇక మహేష్ ఇంట్లో వేడుకల్లో మహేష్ బాబు మాత్రమే కనిపించలేదు. మిగతా అందరూ కూడా సందడి చేశారు. నమ్రత తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసిన ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
View this post on Instagram