Quadrant Future Tek IPO Allotment Status : భారతీయ రైల్వేల కోసం రైలు నియంత్రణ, సిగ్నలింగ్ వ్యవస్థలను అభివృద్ధి చేసే క్వాడ్రంట్ ఫ్యూచర్ టెక్ కంపెనీ ఐపీవోకి సబ్ స్ర్కైబ్ చేసుకునేందుకు తేదీ ముగిసిపోయింది జనవరి 7న ప్రారంభమైన ఈ ఐపీవో గురువారంతో ముగుసింది. కంపెనీ ఐపీవో ఇప్పటివరకు పెట్టుబడిదారుల నుండి మంచి స్పందనను పొందింది. ఎన్ఎస్ ఈ డేటా ప్రకారం, జనవరి 9 గురువారం ఉదయం 10.50 గంటల వరకు ఈ ఐపీవో 61 రెట్లు సబ్‌స్క్రిప్షన్‌ను పొందింది. ప్రత్యేకత ఏమిటంటే ఈ ఐపీవో సబ్‌స్క్రిప్షన్ చాలా వేగంగా పెరుగుతోంది.
భారతీయ రైల్వేల కోసం ‘కవాచ్’ ప్రాజెక్టుపై పనిచేస్తున్న ఈ కంపెనీ, దాని ఐపీవో నుండి మొత్తం రూ.290.00 కోట్లు సేకరించాలనుకుంటోంది. దాని ఐపీవో కింద కంపెనీ ఒక్కో షేరుకు ధర బ్యాండ్‌ను రూ.275 నుండి రూ.290గా నిర్ణయించింది. ఇది మెయిన్‌బోర్డ్ ఐపీవో. ఇది భారతీయ స్టాక్ మార్కెట్‌లోని రెండు ప్రధాన ఎక్స్ఛేంజీలైన బీఎస్ఈ, ఎన్ఎస్ఈ లలో లిస్టింగ్ చేయబడుతుంది. క్వాడ్రంట్ ఫ్యూచర్ టెక్ ఐపీవో కింద రూ. 10 ముఖ విలువ కలిగిన మొత్తం 1,00,00,000 కొత్త షేర్లు జారీ చేయబడతాయి. ఇందులో OFS భాగం ఉండదు.
గురువారం, జనవరి 9న ఐపీవో ముగిసిన తర్వాత, శుక్రవారం, జనవరి 10న షేర్లు కేటాయించబడతాయి. తరువాత వచ్చే వారం జనవరి 13న షేర్లు పెట్టుబడిదారుల డీమ్యాట్ ఖాతాలకు జమ చేయబడతాయి. చివరగా ఆ కంపెనీ మంగళవారం, జనవరి 14న స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో లిస్టింగ్ చేయబడుతుంది.
4 రోజులుగా జీఎంపీలో మార్పులేదు
కంపెనీ ఐపీవో కి పెట్టుబడిదారుల నుండి బలమైన మద్దతు లభిస్తోంది. అందువల్ల, గ్రే మార్కెట్‌లో కూడా కంపెనీ షేర్లలో భారీ ప్రకంపనలు ఉన్నాయి. గురువారం జనవరి 9న, కంపెనీ షేర్లు గ్రే మార్కెట్లో రూ.210 (72.41%) GMPతో ట్రేడవుతున్నాయి. అయితే, గత కొన్ని రోజులుగా దాని GMP రూ.210 వద్ద ఉంది. క్వాడ్రంట్ ఫ్యూచర్ టెక్ షేర్ల GMP ధర సోమవారం, జనవరి 6నే రూ.210కి చేరుకుంది. జనవరి 3 వరకు, దాని GMP 0 వద్ద ఉంది. జనవరి 4న, అది నేరుగా రూ.140కి చేరుకుంది. ఆ తర్వాత జనవరి 5న రూ.180కి, జనవరి 6న రూ.210కి చేరుకుంది.