Homeఅంతర్జాతీయంQatar vs Pakistan: తాలిబన్ సర్కార్ పై ఆదిపత్యం కోసం ఖతార్ వర్సెస్ పాకిస్తాన్

Qatar vs Pakistan: తాలిబన్ సర్కార్ పై ఆదిపత్యం కోసం ఖతార్ వర్సెస్ పాకిస్తాన్

Qatar vs Pakistan: Fighting For Dominance Over Taliban Government

Qatar vs Pakistan: అఫ్గనిస్తాన్ పై పాకిస్తాన్ తన ప్రభావాన్నిచూపాలని భావిస్తోంది. ఎలాగైనా అఫ్గన్ ను తన గుప్పిట్లో ఉంచుకోవాలని చూస్తోంది. దీంతో ఇదే సందర్భంలో కతర్ కూడా తన వైఖరి స్పష్టం చేస్తోంది. అఫ్గన్ విషయంలో తమకు కూడా పెద్దన్న పాత్ర ఉందని చెబుతోంది. ఈ నేపథ్యంలో రెండు దేశాల మధ్య అఫ్గన్ నలిగిపోతోంది. తాలిబన్లను తమ ఆధీనంలో ఉంచుకోవాలని రెండు దేశాలు భావిస్తున్నాయి. అందుకే తమ చెప్పుచేతల్లో ఉంచుకోవాలని తాపత్రయపడుతున్నాయి.

అఫ్గన్ లో అధికారం కోసం ఖలీల్ ఉర్ రహ్మాన్ హడ్కానీ, ముల్లా బరాదర్ మధ్య వివాదం నెలకొంది. ఈ నేపథ్యంలో వీరి మధ్య పరస్పరం వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇరు వర్గాలు బాహాబాహీగా సిద్ధపడినట్లు తెలుస్తోంది. దీన్ని తాలిబన్ నాయకులు ధ్రువీకరించారు. దీంతో మంత్రివర్గం కూర్పుపై ఆధిపత్యం చెలాయించాలని చూస్తున్నారు. త్వరలోనే కాబుల్ చేరుకుని మీడియా ముందకు వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. హడ్కానీ గ్రూప్ వ్యవస్థాపకుడు జలాలుద్దీన్ హడ్కానీకి ఖలీల్ సోదరుడు అవుతాడు.

కతర్ ప్రభుత్వం తాలిబన్ సహ వ్యవస్థాపకుడు ముల్లా ఘనీ బరాదర్ తో బలమైన సంబంధాలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఆయనకు దోహాలో కార్యాలయం ఏర్పాటు చేసింది. బరాదర్ ను అఫ్గాన్ తమకు దిశానిర్దేశం చేసే నాయకుడిగా గుర్తించింది. పాక్ కనుసన్నల్లో తాలిబన్ల పాలనలో హింస కొనసాగుతున్న నేపథ్యంలో పాకిస్తాన్ ను నమ్మడం లేదు. దీంతో కతర్ తన ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని భావిస్తోంది.

పాకిస్తాన్ అఫ్గనిస్తాన్ ను తన కార్యకలాపాల కోసం ఉపయోగించుకోవాలని చూస్తోంది. దీంతో కతర్ మాత్రం దీన్ని ఒప్పుకోవడం లేదు. అఫ్గన్ ను తన పబ్బం గడుపుకోవడానికి ఉపయోగించుకునేందుకు పాకిస్తాన్ కుట్రలు చేస్తోందని తెలుస్తోంది. ఉగ్రవాదులను తన దేశం నుంచి అఫ్గన్ కు ఎగుమతి చేస్తూ అసాంఘిక కార్యకలాపాలు సాగించేందుకు పాక్ కుట్ర పన్నుతున్నట్లు సమాచారం.

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
Exit mobile version