
బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ, మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీల మధ్య ఎవరు గొప్ప కెప్టెన్ అని అడిగితే సగటు అభిమాని తేల్చుకోవడం చాలా కష్టం. అయితే ఇదే విషయంపై మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన అభిప్రాయం వెల్లడించారు. తన దృష్టిలో ఇద్దరు గొప్ప సారథులని, ఎవరికి వారే ప్రత్యేకమని కొనియాడారు. విపత్కర పరిస్థితుల్లో గంగూలీ టీమ్ ఇండియాను ఏకతాటిపైకి తెచ్చాడని, నాణ్యమైన ఆటగాళ్లను ఎంపిక చేసి భారత్ ను కొత్తగా తీర్చిదిద్దాడని చెప్పాడు. ఇక ధోని విషయానికి వస్తే అతడు కెప్టెన్సీ చేపట్టే సమయానికే భారత్ గొప్ప జట్టుగా ఉందని, అది అతడికి కలిసొచ్చిందని మాజీ ఓపెనర్ అభిప్రాయపడ్డాడు.