రవాణాశాఖ మంత్రి ఆకస్మిక తనిఖీలు!

రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఈ రోజు ఖమ్మం బస్టాండ్‌ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. లాక్‌ డౌన్‌ సడలింపులు, ప్రజారవాణా ప్రారంభమైన నేపథ్యంలో ప్రయాణికుల కొరకు అధికారులు ఏర్పాట్ల విషయమై ఆయన ఈ తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా బస్సుల వివరాలు, ప్రయాణికులకు అందిస్తున్న సాకర్యాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి డిపోలో కండక్టర్‌ కు తప్పనిసరిగా హ్యాండ్‌ శానిటైజర్‌ ఇవ్వాలని.. బస్సులో ప్రయాణికులకు హ్యాండ్‌ శానిటైజ్‌ చేసిన తర్వాతే టికెట్‌ ఇవ్వాలని […]

Written By: Neelambaram, Updated On : May 20, 2020 4:36 pm
Follow us on

రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఈ రోజు ఖమ్మం బస్టాండ్‌ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. లాక్‌ డౌన్‌ సడలింపులు, ప్రజారవాణా ప్రారంభమైన నేపథ్యంలో ప్రయాణికుల కొరకు అధికారులు ఏర్పాట్ల విషయమై ఆయన ఈ తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా బస్సుల వివరాలు, ప్రయాణికులకు అందిస్తున్న సాకర్యాల వివరాలను అడిగి తెలుసుకున్నారు.

ప్రతి డిపోలో కండక్టర్‌ కు తప్పనిసరిగా హ్యాండ్‌ శానిటైజర్‌ ఇవ్వాలని.. బస్సులో ప్రయాణికులకు హ్యాండ్‌ శానిటైజ్‌ చేసిన తర్వాతే టికెట్‌ ఇవ్వాలని సూచించారు. మాస్కులు ధరించని ప్రయాణికులకు టికెట్ ఇవ్వవద్దని ఆదేశించారు.

కరోనా వైరస్‌ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోల పరిధిలోని ప్రతి బస్సుకు విధిగా శానిటైజర్‌ అందించాలని ఆదేశాలు ఇచ్చినట్లు చెప్పారు. నిబంధనలను అతిక్రమించే వారిపై తప్పకుండా చర్యలు తీసుకుంటామనిమంత్రి హెచ్చరించారు.