https://oktelugu.com/

రిజర్వేషన్లు 50 శాతం మించకూడదన్న సుప్రీంకోర్టు..!

స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సుప్రీం కోర్టు కీలకమైన తీర్పు ఇచ్చింది. చట్ట ప్రకారం స్థానిక సంస్థల రిజర్వేషన్లు 50 శాతానికి మించడానికి వీలులేదని స్పష్టం చేసింది. రాష్ట్రంలో 48.13 శాతం ఉన్న బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించాలంటూ సుప్రీంకోర్టులో టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‍పై జస్టిస్ అరుణ్ మిశ్రా బెంచ్ బుధవారం విచారణ చేపట్టింది. 1992లో ఇంద్రసహాని కేసులో ప్రత్యేక పరిస్థితుల్లో […]

Written By: , Updated On : May 20, 2020 / 04:35 PM IST
Follow us on


స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సుప్రీం కోర్టు కీలకమైన తీర్పు ఇచ్చింది. చట్ట ప్రకారం స్థానిక సంస్థల రిజర్వేషన్లు 50 శాతానికి మించడానికి వీలులేదని స్పష్టం చేసింది. రాష్ట్రంలో 48.13 శాతం ఉన్న బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించాలంటూ సుప్రీంకోర్టులో టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‍పై జస్టిస్ అరుణ్ మిశ్రా బెంచ్ బుధవారం విచారణ చేపట్టింది. 1992లో ఇంద్రసహాని కేసులో ప్రత్యేక పరిస్థితుల్లో 50 శాతం మించవచ్చన్న అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలని కోరిన పిటిషనర్ రామ్మోహన్‍నాయుడు కోరారు. ఇందుకు కోర్టు నిరాకరించింది. టీడీపీ నాయకులు రామ్మోహన్ నాయుడు, కొనకళ్ల నారాయణ, నిమ్మల కిష్టప్ప, కొల్లు రవీంద్ర, పల్లా శ్రీనివాసలు సహా పలువురు నేతలు ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు ఇవ్వలేదని పిటిషన్‌ దాఖలు చేశారు.

దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్‌ అరుణ్‌ మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈమేరకు తీర్పు వెలువరించింది. 2010లో కె.కృష్ణమూర్తి వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసులో సుప్రీంకోర్టు ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఇచ్చిన తీర్పును అమలు చేయాల్సిందేనని స్పష్టం చేసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ జనాభా మొత్తం కలిపినా స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడాదని తీర్పు వెలువరించింది. తాజాగా మరోసారి ఈ తీర్పును జస్టిస్‌ అరుణ్‌ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం సమర్థించింది.

రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు 59.85 శాతం చేరుకోవడంతో రాజ్యాంగ విరుద్ధంగా మారింది. ఎస్టీలకు 5.73 శాతం, ఎస్సిలకు 20.46 శాతం రిజర్వేషన్లు ఉండగా 50 శాతంలోపు ఉన్న మిగిలిన మొత్తాన్ని బీసీలకు కేటాయిస్తున్నారు. గతంలో హైకోర్టు ఈ విషయంలో ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబట్టింది.