
ఇటీవల తెలంగాణలో జరిగిన మినీ మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేసిన సంగతి తెలిసిందే. అధికారంలో ఉన్న పార్టీకి జనం పట్టకట్టారు. రెండు కార్పొరేషన్లు, ఐదు మున్సిపాలిటీలను టీఆర్ఎస్ గెలిచింది.
ఈ క్రమంలోనే వాటిని మున్సిపల్ మేయర్లు, చైర్మన్ల పేర్లను టీఆర్ఎస్ నాయకత్వం ఖరారు చేసింది. ఎన్నికల పరిశీలకులకు సీల్డ్ కవర్లో ఈ పేర్లను టీఆర్ఎస్ నాయకత్వం పంపింది.
వరంగల్ కు మంత్రులు గంగుల కమాలకర్ , ఇంద్రకరణ్ రెడ్డి, ఖమ్మంకు మంత్రి ప్రశాంత్ రెడ్డి, నూక సురేష్, సిద్దిపేటకు కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్ సింగ్, ఒంటేరు ప్రతాపరెడ్డి, అచ్చంపేటకు మంత్రి నిరంజన్ రెడ్డి, మారెడ్డి శ్రీనివాస్ లను పార్టీ నాయకత్వం ఎన్నికల పరిశీలకులుగా నియమించింది. వీరు కార్పొరేటర్లు, కౌన్సిలర్లతో చర్చలు జరిపి ఎక్కువ మేయర్లు, చైర్మన్లను మహిళలకే కట్టబెట్టారు.
– ఏఏ మున్సిపాలిటికి ఎవరెవరు చైర్మన్ అయ్యారంటే..
– వరంగల్ కార్పొరేషన్ మేయర్ గా గుండు సుధారాణి
-ఖమ్మం మేయర్ గా నీరజ
-సిద్దిపేట మున్సిపాలిటీకి మంజుల,
-జడ్చర్లకు దోరెపల్లి లక్ష్మి,
-నకిరేకల్ లో రాచకొండ శీను
-అచ్చంపేటలో నర్సింహ్మాగౌడ్ లేదా శైలజ
ఈ పేర్లను టీఆర్ఎస్ నాయకత్వం ఖరారు చేసినట్టు సమాచారం. ఇందులో మెజార్టీ పదవులు మహిళలకు కట్టబెట్టినట్టుగా తెలుస్తోంది.