Bhagwant Mann: ఓడలు బండ్లవుతాయి. బండ్లు ఓడలవుతాయనేది సామెత. ఎవరి అదృష్టం ఎలా ఉంటుందో ఎవరికి తెలియని వైనం. ఒకప్పుడు బద్ధ శత్రువులే ఆప్త మిత్రులు కావచ్చు. మంచి మిత్రులే శత్రువులే అవుతారు. దీంతో ఎప్పుడైనా ఎవరిని కూడా కించపరచే విధంగా మాట్లాడటం తగదని తెలుసుకోవాలి. ఇటీవల విడుదలైన అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయకేతనం ఎగురవేసింది. దీంతో ముఖ్యమంత్రి అభ్యర్థిగా భగవంత్ మాన్ నిలవడం తెలిసిందే. దీంతో పంజాబ్ లో మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో అందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
ఇక్కడ ఓ ట్విస్ట్ ఉంది. భగవంత్ మాన్, పీసీసీ అధ్యక్షుడు నవజ్యోతి సింగ్ సిద్దూ మధ్య జరిగిన ఓ ఆసక్తికర సన్నివేశం ఇప్పుడు వైరల్ అవుతోంది. 2016లో నిర్వహించిన ఓ స్టాండప్ కమెడియన్ షోలో సిద్దూ న్యాయనిర్ణేతగా వ్యవహరించారు. ఇందులో పోటీదారుగా వ్యవహరించిన భగవంత్ మాన్ సిద్దూను మెప్పించేందుకు నానా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. దీంతో అప్పుడు జరిగిన సన్నివేశాన్ని గుర్తు చేసుకుని అభిమానులు దానికి సంబంధించిన గుర్తులను నెమరువేసుకుంటున్నారు.
Also Read: యూపీలో యోగి సాధించిన రికార్డులు ఏంటి?
ఈ షోలో భగవంత్ మాన్ ప్రభుత్వం అంటే ఏంటని ప్రశ్నించగా సిద్దూ చెప్పిన సమాధానంతో అందరు నవ్వుకున్నారు. ప్రభుత్వమంటే ఎప్పటికప్పుడు మరిచిపోయేదే అని వ్యంగ్యంగా సమాధానం చెప్పడంతో అప్పుడు జోకర్ గా మారిన భగవంత్ మాన్ ఇప్పుడు సిద్దూను జోకర్ గా మారుస్తూ అధికారం చేజిక్కించుకోవడంపైనే చర్చించుకుంటున్నారు. ఆప్ దెబ్బకు కాంగ్రెస్ పార్టీ కుదేలైపోయింది. దీంతో సిద్దూ ఒకప్పుడు భగవంత్ మాన్ ను నవ్వులపాలు చేస్తే ఇప్పుడు ఆయనను కోలుకోలేని దెబ్బ తీసిన వైనం పై ఆసక్తికర చర్చ సాగుతోంది.
ఆమ్ ఆద్మీ పార్టీ సాధించిన విజయంతో అన్ని పార్టీలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. భగవంత్ మాన్ పంజాబ్ ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టబోతున్న సందర్భంలో కామెడీ షోలో జరిగిన దానికి ప్రతీకారం తీర్చుకున్నారని ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాభవంపై పోస్టుమార్టమ్ నిర్వహిస్తోంది. ఓటమికి గల కారణాలను అన్వేషిస్తోంది. ఇంతటి దారుణమైన ఓటమిపై నేతలు ఆరా తీస్తున్నారు. ఆప్ విజయం ఊహించినదేనని చెబుతున్నారు.
అయిదు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ కోలుకోలేని దెబ్బ తిన్నది. ఉత్తరప్రదేశ్ లో మరీ అధ్వానంగా ఓడిపోయింది. దీంతో అధిష్టానం దీనిపై దృష్టి సారించింది. ఇంతటి ఓటమికి కారణాలేంటని నేతలు మథనపడుతున్నారు. స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్లలో కాంగ్రెస్ పార్టీ పాతాళానికి పడిపోవడం చూస్తుంటే ఇక కోలుకోలేదని చెబుతున్నారు. ఇకపై ఎన్ని వ్యూహాలు పన్నినా తట్టుకోవడం కలేనని చెబుతున్నారు.
Also Read: సీఎం కేసీఆర్ ఆస్పత్రి పాలవడంపై బండి సంజయ్ ఆసక్తికర ట్వీట్