లాక్‌డౌన్‌ ఉల్లంఘిసస్తే కఠిన శిక్షలే!

కరోనా కట్టడికి లాక్‌డౌన్‌ పకడ్బందీగా అమలు జరపడమే మార్గంగా భావిస్తున్న నరేంద్ర మోదీ ప్రభుత్వం ఉల్లంఘనల పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నది. అందుకనే 2005లో యుపిఎ ప్రభుత్వం తీసుకొచ్చిన విపత్తు నిర్వహణ చట్టమాలోని నిబంధనల అమలును మొదటిసారిగా చేయనున్నది. ఈ విషయమై ఇప్పటికే రాష్త్ర ప్రభుత్వాలకు ఆదేశాలు కూడా ఇచ్చింది. ఈ చట్టంలో ప్రధానంగా సెక్షన్‌ 51 నుంచి సెక్షన్‌ 60 వరకు వివిధ నేరాలు, వాటి శిక్షలను నిర్వచించారు. ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకొంటున్న నేపథ్యంలో […]

Written By: Neelambaram, Updated On : April 13, 2020 11:14 am
Follow us on


కరోనా కట్టడికి లాక్‌డౌన్‌ పకడ్బందీగా అమలు జరపడమే మార్గంగా భావిస్తున్న నరేంద్ర మోదీ ప్రభుత్వం ఉల్లంఘనల పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నది. అందుకనే 2005లో యుపిఎ ప్రభుత్వం తీసుకొచ్చిన విపత్తు నిర్వహణ చట్టమాలోని నిబంధనల అమలును మొదటిసారిగా చేయనున్నది. ఈ విషయమై ఇప్పటికే రాష్త్ర ప్రభుత్వాలకు ఆదేశాలు కూడా ఇచ్చింది.

ఈ చట్టంలో ప్రధానంగా సెక్షన్‌ 51 నుంచి సెక్షన్‌ 60 వరకు వివిధ నేరాలు, వాటి శిక్షలను నిర్వచించారు. ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకొంటున్న నేపథ్యంలో ఈ చట్టంలోని సెక్షన్లు, శిక్షల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది.

సెక్షన్‌ 51: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన నిబంధనలను సరైన కారణం లేకుండా అతిక్రమించేవారికి ఏడాది జైలుశిక్ష, జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉంటుంది. నిర్లక్ష్యం కారణంగా ఎవరైనా ప్రాణాలు కోల్పోయినా, ఆపద వాటిల్లే పరిస్థితి ఉత్పన్నమైనా సదరు వ్యక్తికి రెండేండ్ల వరకు జైలుశిక్ష విధించే అవకాశం ఉన్నది.

సెక్షన్‌ 52: ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారం ఇచ్చి అధికారుల నుంచి ఏదైనా సాయం పొందినా, ఏవైనా పనులు చేయించుకున్నా వారికి రెండేండ్ల వరకు జైలుశిక్ష విధించే అవకాశం ఉంది. కొన్నిసార్లు జరిమానా, జైలుశిక్ష రెండూ విధించవచ్చు.

సెక్షన్‌ 53: విపత్తును అరికట్టేందుకు ఉపయోగించే వస్తువులు లేదా నగదును ఎవరైనా దుర్వినియోగం చేసినా, లేదా పారబోసినా అలాంటి వ్యక్తులకు రెండేండ్ల వరకు జైలుశిక్ష లేదా జరిమానా లేదా రెండూ విధిస్తారు.

సెక్షన్‌ 54: ప్రజలను గందరగోళపరిచేలా, ఆందోళన కలిగించేలా తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేసేవారికి గరిష్ఠంగా రెండేండ్ల వరకు జైలు, జరిమానా లేదా రెండూ శిక్షలు విధిస్తారు.

సెక్షన్‌ 56: విధినిర్వహణలో విఫలమైనా, అనుమతి లేకుం డా విధుల నుంచి తప్పుకొ న్నా, ఈ చట్టం కింద ప్రభు త్వం అప్పగించిన బాధ్యతల అమలులో విఫలమైనా, లేదా ఉన్నతాధికారుల అనుమతి లేకుండా విధుల నుంచి వైదొలగినా గరిష్ఠంగా ఏడాది వరకు జైలు, జరిమానా విధించే అవకాశం ఉన్నది.

సెక్షన్‌ 55: ప్రభుత్వ అధికారి/ ఏదైనా విభాగం ఈ చట్టాన్ని ఉల్లంఘిస్తే చర్యలకు ఆదేశించవచ్చు. తనకు తెలియకుండానే ఆ తప్పు జరిగినట్టు నిరూపించే ఆధారాలు సమర్పిస్తే విచారణ నుంచి మినహాయింపు ఉంటుంది.

సెక్షన్‌ 57, 58: విపత్తు నిర్వహణ చట్టం-2005 నిబంధనలను ఏదైనా కంపెనీ లేదా కార్పొరేట్‌ బాడీ ఉల్లంఘించినట్టు నిరూపితమైతే ఆ కంపెనీ డైరెక్టర్‌, మేనేజర్‌, ఆ సమయంలో విధుల్లో ఉన్న సిబ్బందికి ఏడాది జైలుశిక్ష, జరిమానా విధిస్తారు.

సెక్షన్‌ 59: సెక్షన్‌ 55, 56ల కింద నమోదైన కేసుల ప్రాసిక్యూషన్‌కు వినియోగిస్తారు.

సెక్షన్‌ 60: ఈ చట్టం పరిధిలోని అంశాల్లో కోర్టులు నేరుగా కలుగజేసుకునే అవకాశం ఉండదు.