https://oktelugu.com/

నాగ్ జడ్జిమెంట్ ఈసారి అఖిల్ ని గట్టెక్కిస్తుందా!

అక్కినేని నాగార్జున ఈ సారి టెన్షన్ పడటం లేదట …కొడుకు అఖిల్ ఇంతవరకూ చేసిన మూడు సినిమాలు అక్కినేని అభిమానులను పూర్తిస్థాయిలో ఆకట్టుకోలేకపోయాయి. దాంతో ఈ సారి తప్పకుండా హిట్ కొట్టాలనే పట్టుదలతో నాగార్జున ఉన్నాడు. అందుకే అఖిల్ నాలుగో చిత్ర విషయంలో అఖిల్ ఎక్కువ గ్యాప్ తీసుకుని ‘బొమ్మరిల్లు’ భాస్కర్ తో సినిమా చేయడం జరిగింది. కాగా యూత్ ని టార్గెట్ చేస్తూ నిర్మించిన ఈ సినిమా కి ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ‘ అనే […]

Written By:
  • admin
  • , Updated On : April 13, 2020 / 11:37 AM IST
    Follow us on


    అక్కినేని నాగార్జున ఈ సారి టెన్షన్ పడటం లేదట …కొడుకు అఖిల్ ఇంతవరకూ చేసిన మూడు సినిమాలు అక్కినేని అభిమానులను పూర్తిస్థాయిలో ఆకట్టుకోలేకపోయాయి. దాంతో ఈ సారి తప్పకుండా హిట్ కొట్టాలనే పట్టుదలతో నాగార్జున ఉన్నాడు. అందుకే అఖిల్ నాలుగో చిత్ర విషయంలో అఖిల్ ఎక్కువ గ్యాప్ తీసుకుని ‘బొమ్మరిల్లు’ భాస్కర్ తో సినిమా చేయడం జరిగింది. కాగా యూత్ ని టార్గెట్ చేస్తూ నిర్మించిన ఈ సినిమా కి ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ‘ అనే క్యాచీ టైటిల్ పెట్టడం జరిగింది .

    నిజానికి అఖిల్ సినిమాల రఫ్ ఎడిటింగ్ పూర్తయ్యాక ,ఒకసారి రష్ చూసి సూచనలు చేయడం నాగార్జున అలవాటు. అలాగే ఈ `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ` సినిమా రఫ్ ఎడిటింగ్ పూర్తయ్యాక నాగ్ సార్ చూశాడట. ప్రీ క్లైమాక్స్ కి సంబంధించిన రెండు సీన్స్ విషయంలో కొద్దిపాటి మార్పులు చెప్పారని యూనిట్ అంటున్నారు. అది తప్పితే టోటల్ అవుట్ పుట్ పట్ల ఆయన సంతృప్తిని వ్యక్తం చేశారని చెబుతున్నారు. ప్రాజెక్టు కొంత లేట్ అయినప్పటికీ అఖిల్ కి సరైన సినిమా రాబోతుందని నాగ్ సార్ హర్షం వ్యక్తం చేశారని కూడా అంటున్నారు. కాగా పూజ హెగ్డే కథానాయికగా నటించిన ఈ సినిమాను లాక్ డౌన్ గొడవ సద్దుమణి గాక విడుదల చేయాలనే ఆలోచనలో గీతా ఆర్ట్స్ యూనిట్ ఉంది.