పబ్లిసిటీకి ఒక ‘లిమిట్’ ఉంటుంది… ఒక మనస్’సాక్షి’ ఉంటుంది…!

నేరుగా విషయంలోకి వచ్చేస్తే…. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పెద్ద మనసుతో ఓ వ్యక్తికి సాయం అందించారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఓ బాధితుడికి ముఖ్యమంత్రి సహాయనిధి నుండి 10 లక్షల రూపాయలు అందించారు. అయితే ఇక్కడ ఆ వ్యక్తి పవన్ కళ్యాణ్ వీరాభిమాని కావడంతో వైసిపి అనుకూల మీడియా తన పబ్లిసిటీ స్టంట్స్ ను మొదలు పెట్టింది. Also Read: స్వర్ణ ప్యాలెస్ అగ్ని ప్రమాదం వెనకున్న అసలు కుట్ర బయటపడింది…! ఎక్కడైనా అధికార […]

Written By: Navya, Updated On : August 16, 2020 5:46 pm
Follow us on

నేరుగా విషయంలోకి వచ్చేస్తే…. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పెద్ద మనసుతో ఓ వ్యక్తికి సాయం అందించారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఓ బాధితుడికి ముఖ్యమంత్రి సహాయనిధి నుండి 10 లక్షల రూపాయలు అందించారు. అయితే ఇక్కడ ఆ వ్యక్తి పవన్ కళ్యాణ్ వీరాభిమాని కావడంతో వైసిపి అనుకూల మీడియా తన పబ్లిసిటీ స్టంట్స్ ను మొదలు పెట్టింది.

Also Read: స్వర్ణ ప్యాలెస్ అగ్ని ప్రమాదం వెనకున్న అసలు కుట్ర బయటపడింది…!

ఎక్కడైనా అధికార పార్టీ చేయలేని పనిని.. ప్రతిపక్షం వారు చేస్తే ఇది వారు చేయాల్సిన పనులు అని మీడియా ఎద్దేవా వేస్తుంది. అంతేగాని అధికార పార్టీ అధినేత…. అందులోనూ ఒక సినీస్టార్ అభిమానికి ముఖ్యమంత్రి తన బాధ్యతలు నిర్వర్తిస్తే మాత్రం ‘పవన్ కళ్యాణ్ అభిమాని కి జగన్ సాయం’ అంటూ ఒక కొత్త కథనాన్ని వండి వడ్డించడం ఏమిటో ఎవరికీ అర్థం కావడం లేదు. అంటే…. పవన్ అభిమానులు రాష్ట్రంలో భాగం కాదా…? వారేమన్నా గ్రహాంతరవాసులా? బాధితుడు ఒక రాష్ట్ర పౌరుడు. జగన్ బాధ్యతగల ప్రభుత్వానికి అధినేత. ప్రజల ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవడం అతని పని. ముఖ్యమంత్రి సహాయనిధి నుండి డబ్బులు కేటాయిస్తారో…. మరో రకంగా సాయం అందించి వైద్యం చేయిస్తాడో…. లేదా ఆరోగ్యశ్రీలో కొత్త రోగాలను ప్రవేశపెడతారో అన్నది వేరే చర్చ. ‘కానీ పవన్ అభిమానికి జగన్ సాయం’. ఈ టైటిల్ ఏమిటి?

జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాల్లో భాగంగా ఎంతోమంది పవన్ కళ్యాణ్ అభిమానులకు ఆర్థిక సహాయం అందింది. దానికి కూడా రాష్ట్రంలో ఎంతమంది పవన్ అభిమానులు ఉంటే.. అందరికీ జగన్ చేయూత అని బోర్డులు పెట్టేస్తారా..? స్క్రోలింగ్ లు వేసేస్తారా? పవన్ కళ్యాణ్ అంటే రాజకీయంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అసలు పడదు. పవన్ కళ్యాణ్ అభిమానులు మీద చాలా సందర్భాల్లో అటు వైసిపి నేతలు ఇటు వైసిపి అనుకూల మీడియా అవాకులు చవాకులు పేల్చిన సందర్భాలు చాలా చూశాం. కానీ పార్టీ వేరు… ప్రభుత్వం వేరు. ప్రభుత్వం అన్న తర్వాత అందరిని సమభావంతో చూడాల్సిందే.

Also Read: సోము వీర్రాజు గేమ్ ప్లాన్ ఏమిటీ?

సాయం వద్దకు వచ్చేటప్పటికీ అతను పవన్ అభిమానా లేదా ఇంకొకరి అభిమానా అని ప్రత్యేకించి చూడటం ఏమిటో ఎవరికీ అర్థం కావడం లేదు. ముఖ్యమంత్రి పవన్ అభిమానికి సాయం అందించడం నిజంగా అభినందనీయం…. దానిని తప్పు పట్టలేం. కాని దీనిని పబ్లిసిటీకి వాడుకోవాలని చూడడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశం అయింది. ఇక పబ్లిసిటీకి అంటూ ఒక పరిధి ఉంటుంది. ఇంత దిగజారుడు రాజకీయాలకు వీరే పరాకాష్ట అని ఈ వ్యవహారంపై సదరు మీడియా ఛానల్ ను తీవ్రంగా విమర్శిస్తున్నారు. రేపోమాపో సీఎం సహాయనిధి నుండి ఇంకో పార్టీ కార్యకర్తలు సహాయం అందించారని కొత్త పబ్లిసిటీ స్టంట్లు స్టార్ట్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు మరి..!