చెట్టును నరకడం ఇష్టం లేకా ఆ వ్యక్తి ఏం చేశాడంటే?

చాలామంది ఇల్లు కట్టుకునే సమయంలో ఇంటి చుట్టూ చెట్లు లేకుండా జాగ్రత్త పడతారు. ఒకవేళ అప్పటికే పెద్దపెద్ద చెట్లు ఉంటే వాటిని నరికేస్తూ ఉంటారు. కానీ మాస్కోకు చెందిన ఒక వ్యక్తి మాత్రం ప్రకృతితో మమేకమై జీవించాలని భావించాడు. చెట్టును అలాగే ఉంచి డోమ్ ను నిర్మించి తనకు నచ్చిన విధంగా ఇంటి నిర్మాణం పూర్తి చేసుకున్నాడు. మాస్కోకు చెందిన అల్మాస్సోన్ అనే వ్యక్తి వృత్తిరిత్యా అర్కిటెక్ట్ గా పని చేసేవాడు. Also Read: కారును బైకులా […]

Written By: Kusuma Aggunna, Updated On : August 16, 2020 7:11 pm
Follow us on

చాలామంది ఇల్లు కట్టుకునే సమయంలో ఇంటి చుట్టూ చెట్లు లేకుండా జాగ్రత్త పడతారు. ఒకవేళ అప్పటికే పెద్దపెద్ద చెట్లు ఉంటే వాటిని నరికేస్తూ ఉంటారు. కానీ మాస్కోకు చెందిన ఒక వ్యక్తి మాత్రం ప్రకృతితో మమేకమై జీవించాలని భావించాడు. చెట్టును అలాగే ఉంచి డోమ్ ను నిర్మించి తనకు నచ్చిన విధంగా ఇంటి నిర్మాణం పూర్తి చేసుకున్నాడు. మాస్కోకు చెందిన అల్మాస్సోన్ అనే వ్యక్తి వృత్తిరిత్యా అర్కిటెక్ట్ గా పని చేసేవాడు.

Also Read: కారును బైకులా మార్చి ప్రాణాలు దక్కించుకున్నాడు!

చెట్లను ఎంతో ప్రేమించే అల్మాస్సోన్ మందంగా ఉండే గ్లాస్ తో నాలుగు అంతస్తుల భవనాన్ని నిర్మించాడు. ఎండ, వేడి లోపలికి రాకుండా చేసే ప్రత్యేకమైన గ్లాస్ తో ఇంటి నిర్మాణం చేపట్టాడు. చెక్కల గోడల ద్వారా ప్రతి పనికి ప్రత్యేకమైన గదులను నిర్మించాడు. అల్మాస్సోవ్ కాలుష్యంతో ఉండే నగర వాతావరణం నచ్చదు. కిచె, బెడ్ రూమ్, స్టడీ రూమ్ ఇలా వేరువేరు గదులను ఏర్పాటు చేసుకున్నాడు.

Also Read: షాకింగ్: గుండె జబ్బులున్న వారి ప్రాణాలు తీస్తోన్న కరోనా!

అందువల్ల సిటీకి దూరంగా దట్టమైన అడవిలో ఇంటిని నిర్మించుకున్నాడు. చెట్టును అలాగే ఉంచి అల్మాస్సోవ్ నిర్మించిన ఇంటికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రకృతి ప్రేమికులు తమకు కూడా ఇలాంటి ఇల్లు ఉంటే బాగుంటుందని కామెంట్లు చేస్తుండగా మరికొందరు తాము ఫోటోలో లాంటి ఇంటిని నిర్మించుకునే ప్రయత్నం చేస్తామని కామెంట్లు చేస్తున్నారు.