Provident Fund : ప్రావిడెంట్ ఫండ్. ఒకప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు మాత్రమే తమ జీవితంలో కొంత భాగాన్ని రిటర్మెంట్ కోసం సేవ్ చేసుకునేవారు. కానీ ఇప్పుడు ప్రైవేటు ఉద్యోగులు సైతం ప్రావిడెంట్ ఫండ్ ద్వారా జీతం లోని కొంత మొత్తాన్ని సేవ్ చేసుకొని రిటర్మెంట్ తర్వాత అధిక మొత్తంగా పొందే ప్లాన్ చేసుకుంటున్నారు. ప్రతి కంపెనీ ఉద్యోగి నుంచి వారి జీతాన్ని బట్టి ప్రావిడెంట్ ఫండ్ అమౌంట్ కట్ చేస్తుంది. ఈ మొత్తానికి కంపెనీ మరికొంత మొత్తం కలిపి ఉద్యోగికి అందిస్తుంది. అయితే సాధారణంగా ఈ మొత్తాన్ని రిటర్మెంట్ అయిన తర్వాత మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. కానీ కొన్ని అత్యవసర పరిస్థితుల్లో కూడా ఉద్యోగులు మధ్యలోనే పిఎఫ్ ను విత్డ్రా చేసుకోవచ్చు. అయితే పీఎఫ్ విత్ డ్రా చేసుకొని సమయంలో ఎలాంటి అవసరాల కోసం చేసుకోవాలి?
Also Read : మహేష్ బాబు రాజమౌళి సినిమాతో మరోసారి ఇండస్ట్రీ హిట్ కొట్టబోతున్నాడా..?
ప్రస్తుత కాలంలో డబ్బు అవసరం ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ కొన్ని అత్యవసర పరిస్థితుల్లో డబ్బు అవసరం పడితే ఇతరులు ఇచ్చే పరిస్థితులు లేవు. ముఖ్యంగా కరోనా తర్వాత ప్రతి ఒక్కరూ డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నారు. అందువల్ల బ్యాంకు రుణాలు లేదా ఇతర మార్గాల ద్వారా మాత్రమే డబ్బు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే బ్యాంకు రుణాల ద్వారా అప్పు చేసే బదులు సేవింగ్ లోని కొంత మొత్తాన్ని విత్ డ్రా చేసుకోవడం ద్వారా కాస్త ఆర్థిక భారం తగ్గుతుంది. ముఖ్యంగా అత్యవసర పరిస్థితుల్లో ప్రావిడెంట్ ఫండ్ మొత్తం విత్తిగా చేసుకోవచ్చు. అయితే ఇటువంటి పరిస్థితుల్లో పిఎఫ్ చేయాలంటే?
వైద్య ఖర్చుల నిమిత్తం పావిడెంట్ ఫండ్ ను విత్ డ్రా చేసుకోవచ్చు. ప్రస్తుతం ప్రావిడెంట్ ఫండ్ ఆన్లైన్ లోనే క్లెయిమ్ చేసుకోవచ్చు. ఈ క్లీన్ చేసుకునే సమయంలో వైద్య ఖర్చులకోసం ఆప్షన్ ఉంటుంది. దీనిని సెలెక్ట్ చేసుకున్న తర్వాత కావాల్సిన అమౌంట్ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అయితే మొత్తం అమౌంట్ లో 70% మాత్రమే విత్ డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది.
పెళ్లి కోసం కూడా పిఎఫ్ ను విత్ డ్రా చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన ఆప్షన్ కూడా పీఎఫ్ క్లెయిమ్ చేసుకునే సమయంలో చూపిస్తుంది. అయితే కొందరికి పెళ్లిల సమయంలో ఇతరులను అప్పు అడిగితే ఇచ్చే పరిస్థితి ఉండదు. అంతేకాకుండా పెళ్లి అత్యవసరం కాబట్టి ఈ సమయంలో ప్రావిడెంట్ ఫండ్ ను విత్డ్రా చేసుకోవచ్చు.
ప్రతి ఒక్కరికి ఇంటి నిర్మాణం అత్యవసరం. అందువల్ల ఇంటి నిర్మాణం కోసం కూడా ప్రావిడెంట్ ఫండ్లు విత్ డ్రా చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన ఆప్షన్ కూడా క్లెయిమ్ బాక్స్ లోచూ చూపిస్తుంది. అయితే ఇంటి నిర్మాణం లేదా పాత ఇంటి మరమ్మతుల కోసం కూడా పిఎఫ్ విత్ డ్రా చేసుకోవడం వల్ల ఆర్థికంగా ఇబ్బందులు లేకుండా ఉంటుంది.
ఇలా ముఖ్యమైన వాటికి మాత్రమే రాయినేట్ పంటను విత్ డ్రా చేసుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు. సొంత ఖర్చులకోసం లేదా జల్సా లకు ప్రావిడెంట్ ఫండ్ ను విత్టా చేసుకోవడం వల్ల భవిష్యత్తులో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.
Also Read : నాని ‘ప్యారడైజ్’ చిత్రం లో హీరోయిన్ గా డ్రాగన్ బ్యూటీ..రెమ్యూనరేషన్ ఎంతంటే!