China President Xi Jinping: చైనా అంటే ఒక కమ్యూనిస్టు రాజ్యం.. అక్కడ ఏం జరుగుతుందో తెలియనీయదు. బయట ఏం జరుగుతుందో తెలుసుకునేదాకా ఆగదు. మొదటి నుంచి చైనాది మొత్తం కుతంత్రాల నేపథ్యమే. ఎదుటి దేశాన్ని తొక్కి ఎదగాలి అనుకునే తత్వం. ఓ టిబెట్, పాక్, శ్రీలంక, ఒక్కటా రెండా ఎన్ని దేశాలు సంక నాకి పోయాయని.. మొన్న టిబెట్ లో పర్యటించిన అమెరికా చట్టసభల స్పీకర్ నాన్సీ పావెల్ ను ఎంతలా తూర్పార పట్టిందో చూశాం కదా! అలాంటి దేశంలో నేడు సొంత కుంపటి రేగింది. ఇది ఎప్పటి నుంచో ఉంది. కానీ ఇప్పుడే బయటి ప్రపంచానికి తెలుస్తోంది.

ఏం జరిగిందంటే..
“అధ్యక్షుడు జిన్ పింగ్ దిగిపోవాలి..స్టెప్ డౌన్ చైనా కమ్యూనిస్టు పార్టీ. అన్ లాక్ షిన్ జియాంగ్. పీసీఆర్ టెస్టులు వద్దు” అంటూ చైనీయులు తమ దేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. చరిత్రలో కనీ విని ఎరుగని స్థాయిలో రోడ్లమీదకి వచ్చి నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. జీరో కోవిడ్ పాలసీ పేరుతో నెలల తరబడి లాక్ డౌన్ లతో మగ్గిపోయిన ప్రజల ఆగ్రహం కట్టలు తెంచుకుంటున్న ఫలితం అది. ఇటీవల షిన్ జీయాంగ్ ప్రావిన్స్ రాజధాని ఉరువ్ కీ లోని భవనంలో జరిగిన అగ్ని ప్రమాదంలో పదిమంది చనిపోయారు.. ఇది ప్రజా గ్రహానికి బీజం వేసింది.. ఆ ప్లాట్ల తలుపులకు చైనా ప్రభుత్వం తాళం వేసింది… దీంతో ప్రమాదం నుంచి తప్పించుకోలేక అందులో ఉన్నవారు చనిపోయారు. మరో తొమ్మిది మంది పరిస్థితి విషమంగా ఉంది.
ఆందోళనలు మొదలయ్యాయి
ఈ ఘటన తర్వాత చైనాలో ఆందోళనలు మొదలయ్యాయి. ఇక అగ్నిప్రమాదం జరిగిన నగరంలో శాంతియుతంగా ఆందోళనలు మొదలయ్యాయి..హాన్ వర్గం చైనీయులు, వుయ్ ఘర్ వర్గం ముస్లింలు ఇందులో పాల్గొన్నారు.. అయితే వారి నిరసన అణచివేసేందుకు పోలీసులు లాఠీలకు పని చెబుతున్నారు.. ఈ వీడియోలు చైనా సోషల్ మీడియా, ట్విట్టర్ లో వైరల్ గా మారాయి. ఇక ఈ ఆందోళనలు బీజింగ్, షాంగై, జిన్ జియాంగ్ వ్యక్తంగా విస్తరించాయి.. దీంతో చైనా ప్రభుత్వం కొంతమేర వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది. షిన్ జియాంగ్ లో జీరో కోవిడ్ లక్ష్యాన్ని సాధించామని, దశలవారీగా లాక్ డౌన్ ఎత్తేస్తామని ప్రభుత్వం చెబుతోంది..

అణచివేస్తోంది
ఉర్ వ్ కీ ప్రాంతంలో భారీగా బలగాలను ప్రభుత్వం మోహరించింది.. బీజింగ్,షాంగై లోనూ పోలీసులు భారీగా మోహరించారు. అయితే ప్రజల ఆందోళనలను ఎక్కడి కక్కడ అణిచివేసే చర్యలు కొనసాగుతున్నాయి. అయితే ఆందోళనకారులు ఖాళీ పేపర్లతో నిరసన తెలుపుతున్నారు. 2020లో హాకాంగ్ విలీన సమయంలో ప్రభుత్వ వ్యతిరేక రాతలను చైనా నిషేధించింది. ఉల్లంఘించే వారికి కఠిన శిక్షలు విధిస్తున్నది. ఇక అప్పటి నుంచి చైనా లో తెల్ల కాగితాలతో ప్రజలు నిరసన తెలుపుతున్నారు.. మరో వైపు ప్రపంచం మొత్తం కొవిడ్ తగ్గుముఖం పడుతుంటే డ్రాగన్ దేశంలో పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో 39,501 కేసులు నమోదు కావడం పరిస్థితి తీవ్రతను తేట తెల్లం చేస్తోంది. గడిచిన నాలుగు రోజులుగా కేసులు 35 వేలకు పైగా కేసులు ఉంటున్నాయి. ప్రపంచాన్ని అతలాకుతలం చేయాలని చైనా భావిస్తే, ఇప్పుడు ఆ దేశమే అల్లకల్లోలం అవుతున్నది. వీధి వైచిత్రి అంటే ఇదే కాబోలు.