Trump Tariffs: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. భారత్‌పై కన్నెర్రజెస్తున్నారు. టారిఫ్‌ల మోత మోగిస్తున్నారు. ఆగస్టు 1 నుంచి 25 శాతం సుంకాలు అమలులోకి వచ్చాయి. ఆగస్టు 27 నుంచి మరో 25 శాతం సుంకాలు అమలులోకి రాబోతున్నాయి. మనతోపాటు కెనడా, బ్రెజిల్, ప్రాన్స్ తదిత దేశాలపైనా భారీగా టారిఫ్‌లు విధించారు ట్రంప్. దీంతో ఆయా దేశాల్లో ట్రంప్‌పై నిరసనలు హెరెత్తాయి. అయితే భారత్‌లో మాత్రం నేతలు ప్రకటనలకే పరిమితమయ్యారు. కానీ ఎట్టకేలకు మహారాష్ట్రలో ట్రంప్ టారిఫ్‌లపై నిరసన వ్యక్తమైంది. నాగ్‌పూర్‌లో జరిగే శతాబ్దాల నాటి మర్బత్ పండుగ, సంప్రదాయకంగా దుష్టశక్తులను తరిమికొట్టడానికి, సామాజిక అన్యాయాలను ఎత్తిచూపడానికి ఒక వేదికగా ఉంటుంది. ఈ సంవత్సరం, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై భారతదేశంపై విధించిన 50% సుంకాలకు నిరసనగా ఆయన భారీ దిష్టిబొమ్మను ఊరేగించారు.
Also Read: విరాట్ కోహ్లీ నెంబర్ వన్ క్రికెటర్ మాత్రమే కాదు.. ఆచరించాల్సిన వ్యాపార సిద్ధాంతం కూడా!
భారత్–అమెరికా వాణిజ్య ఉద్రిక్తతలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆగస్టు 6న భారతదేశంపై 25% అదనపు సుంకాలను విధించారు, దీంతో మొత్తం సుంకం 50%కి చేరింది. భారతదేశం రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం, ఉక్రెయిన్ యుద్ధంలో రష్యాకు ఆర్థికంగా సహాయపడుతుందని అమెరికా ఆరోపించింది. ఈ సుంకాలు భారతదేశ ఎగుమతులపై తీవ్ర ప్రభావం చూపనున్నాయి, ముఖ్యంగా వస్త్రాలు, ఆభరణాలు, సీఫుడ్ వంటి రంగాలు దెబ్బతినే అవకాశం ఉంది. భారత ప్రభుత్వం ఈ చర్యలను ‘అన్యాయమైనవి, న్యాయవిరుద్ధమైనవి‘ అని ఖండించింది.
పండుగలో నిరసన..
నాగ్‌పూర్‌లో జరిగే మర్బత్ పండుగ 19వ శతాబ్దంలో ప్రారంభమై, దుష్టశక్తులను తొలగించడానికి దిష్టిబొమ్మలను ఊరేగించి, ఆపై వాటిని దహనం చేయడం లేదా నీటిలో ముంచడం సంప్రదాయంగా ఉంది. ఈ పండుగ ఇప్పుడు సామాజిక, రాజకీయ సమస్యలను ఎత్తిచూపే వేదికగా మారింది. ఈ సంవత్సరం ట్రంప్ దిష్టిబొమ్మను ఊరేగించడం ద్వారా, సుంకాలను ఒక ‘దుష్టశక్తి‘గా ప్రజలు చిత్రీకరించారు. దిష్టిబొమ్మతోపాటు ‘టారిఫ్ లగాకర్ హమీ జో దరాయే, భారత్ కీ తాకత్ ఉస్సే రులాయే‘ (సుంకాలతో మమ్మల్ని భయపెట్టే వారిని భారత్ శక్తి ఏడిపిస్తుంది) వంటి ప్లకార్డులు కనిపించాయి. ట్రంప్ దిష్టిబొమ్మను ఊరేగించడం ద్వారా నాగ్పూర్ ప్రజలు తమ నిరసనను సంప్రదాయ, సాంస్కృతిక వేదిక ద్వారా వ్యక్తం చేశారు.