https://oktelugu.com/

Ravi Teja: రవితేజకు కూడా రెండు డేట్లు ఎందుకయ్యా ?

Ravi Teja: మాస్‌ మహారాజా రవితేజ హీరోగా వస్తున్న కొత్త సినిమా ‘రామారావు ఆన్‌ డ్యూటీ’. అయితే, ఈ సినిమాకి కూడా ప్రస్తుతం రెండు విడుదల తేదీలను ప్రకటించి షాక్ ఇచ్చారు. ఎదో ఆర్ఆర్ఆర్ సినిమాకి రెండు రిలీజ్ డేట్లు అంటే.. ఓకే పెద్ద సినిమా కాబట్టి.. మనం సరిపెట్టుకోవచ్చు. కానీ రవితేజ సినిమాకు కూడా రెండు రిలీజ్ డేట్లు ఎందుకయ్యా ? అసలు సినిమాని ఎప్పుడు రిలీజ్ చేయాలో కూడా తెలియకుండా అసలు సినిమాలు ఎందుకు […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : February 1, 2022 / 05:29 PM IST
    Follow us on

    Ravi Teja: మాస్‌ మహారాజా రవితేజ హీరోగా వస్తున్న కొత్త సినిమా ‘రామారావు ఆన్‌ డ్యూటీ’. అయితే, ఈ సినిమాకి కూడా ప్రస్తుతం రెండు విడుదల తేదీలను ప్రకటించి షాక్ ఇచ్చారు. ఎదో ఆర్ఆర్ఆర్ సినిమాకి రెండు రిలీజ్ డేట్లు అంటే.. ఓకే పెద్ద సినిమా కాబట్టి.. మనం సరిపెట్టుకోవచ్చు. కానీ రవితేజ సినిమాకు కూడా రెండు రిలీజ్ డేట్లు ఎందుకయ్యా ? అసలు సినిమాని ఎప్పుడు రిలీజ్ చేయాలో కూడా తెలియకుండా అసలు సినిమాలు ఎందుకు తీస్తారయ్యా ? అంటూ నెటిజన్లు సీరియస్ అవుతున్నారు.

    Ravi Teja

    అన్నట్టు ఈ ‘రామారావు ఆన్ డ్యూటీ’ సినిమా షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది. ఒకటి రెండు సాంగ్స్ మాత్రమే బ్యాలెన్స్ ఉన్నాయి. ఆ సాంగ్స్ లో ఒక ఐటమ్ సాంగ్ కూడా ఉంది. ఈ సాంగ్ లో ‘అన్వేషి జైన్’ అనే మోడల్ నటించింది. బాలీవుడ్ లో ‘గంధీ బాత్’ అనే ఓ ఓటీటీ సిరీస్ లో విచ్చలవిడిగా నటించింది ఈ బ్యూటీ. ఇటీవలే ఈ పాటలో సగం భాగాన్ని హైదరాబాద్ లో చిత్రీకరించారట.

    Also Read: తెలుగు తెరకు రెండు తేదీలు అలవాటు చేసిన రాజమౌళి !

    శృంగార తారతో రవితేజ కూడా అదిరిపోయే స్టెప్పులు వేశాడని, తెలుగులో ఈ రేంజ్ ఐటెం సాంగ్ ఇంతవరకు రాలేదు అని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో రవితేజ పారితోషికం పై కూడా అనేక రూమర్స్ వినిపించాయి. గతంలో కంటే కూడా.. ఈ సినిమాకు రవితేజ ఎక్కువ కక్కుర్తి పడుతున్నాడని ఇలా వచ్చాయి రవితేజ పై వార్తలు.

    Ravi Teja

    అయితే రవితేజ ఉన్నట్టు ఉండి, ఇలా పారితోషికం విషయంలో ఎక్కువ డిమాండ్ చేయడానికి కారణం.. ‘క్రాక్’ అద్భుత విజయాన్ని అందుకోవడం అట. అన్నట్టు రవితేజ సినిమాల లిస్ట్ లో సుధీర్ వర్మ దర్శకత్వంలో ఒక సినిమా ఉంది, అలాగే వంశీకృష్ణ అనే మరో దర్శకుడితో మరో సినిమా ఉంది.

    Also Read:ఎక్స్ గ్రేషియా వ‌ద్దు.. నిందితుడిని క‌ఠినంగా శిక్షించాల్సిందే..

    Tags