https://oktelugu.com/

కరోనా ఎఫెక్ట్.. ప్రైవేట్ అంబులెన్సుల అడ్డగోలు దందా

కరోనా పేరు చెబితేనే ప్రజలంతా బెంబేలెత్తిపోతున్న పరిస్థితి. ఈ భయాన్నే కొందరు వైద్యులు, ప్రైవేట్ అంబులెన్స్ నిర్వహాకులు క్యాష్ చేసుకుంటున్నారు. కాసుల కక్కుర్తితో మానవత్వాన్ని మంటగలుపుతున్నారు. కరోనా రోగులకు ప్రైవేట్ ఆస్పత్రి యాజమాన్యాలు వేస్తున్న బిల్లులు చూస్తుంటే అవాక్కవాల్సిందే. ప్రభుత్వ నిబంధనలను బేఖాతరు చేస్తూ కరోనా రోగుల నుంచి లక్షల్లో బిల్లులు వసూలు చేస్తుండటం మనం నిత్యం వార్తల్లో చూస్తూనే ఉన్నాం. అయితే ప్రభుత్వ పెద్దల అండతోనే పలు ప్రైవేట్ ఆస్పత్రులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. […]

Written By:
  • Neelambaram
  • , Updated On : August 12, 2020 / 02:00 PM IST
    Follow us on


    కరోనా పేరు చెబితేనే ప్రజలంతా బెంబేలెత్తిపోతున్న పరిస్థితి. ఈ భయాన్నే కొందరు వైద్యులు, ప్రైవేట్ అంబులెన్స్ నిర్వహాకులు క్యాష్ చేసుకుంటున్నారు. కాసుల కక్కుర్తితో మానవత్వాన్ని మంటగలుపుతున్నారు. కరోనా రోగులకు ప్రైవేట్ ఆస్పత్రి యాజమాన్యాలు వేస్తున్న బిల్లులు చూస్తుంటే అవాక్కవాల్సిందే. ప్రభుత్వ నిబంధనలను బేఖాతరు చేస్తూ కరోనా రోగుల నుంచి లక్షల్లో బిల్లులు వసూలు చేస్తుండటం మనం నిత్యం వార్తల్లో చూస్తూనే ఉన్నాం. అయితే ప్రభుత్వ పెద్దల అండతోనే పలు ప్రైవేట్ ఆస్పత్రులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ప్రభుత్వం ఇటీవల ఒకట్రెండు ఆస్పత్రులపై కోరఢా ఝళిపించింది. అయినప్పటి ప్రైవేట్ ఆస్పత్రి యాజమాన్యాల వైఖరిలో మార్పు రాకపోవడం శోచనీయంగా మారింది.

    Also Read: అమ్మా దొంగ.. కేసీఆర్, జగన్ మాస్టర్ ప్లానేనా?

    కరోనా రోగి ప్రైవేట్ ఆస్పత్రిలో చేరితే బ్రతుకుతాడో.. లేదో తెలియదుగానీ బిల్లు చూస్తే మాత్రం హార్ట్ ఎటాక్ వచ్చిపోవడం ఖాయమనే సైటర్లు విన్పిస్తున్నాయి. ఇటీవల రాష్ట్రంలో వెలుగు చూసిన సంఘటనలే ఇందుకు అద్దంపడుతున్నాయి. లక్షల్లో బిల్లులు చూస్తుంటే కరోనా భయాన్ని ప్రైవేట్ ఆస్పత్రులు ఎలా క్యాష్ చేసుకుంటున్నాయో అర్థం చేసుకోవచ్చు. ప్రాణభయంతో పలువురు కరోనా రోగులు ఆస్తులు తాకట్టు పెట్టి చికిత్స చేయించుకుంటున్నారు. వీరిలో కొందరు డబ్బులు పోగుట్టుకున్నప్పటికీ ప్రాణాలు దక్కుంచుకున్నారు. మరికొందరేమో డబ్బులతోపాటు ప్రాణాలను పొగొట్టుకొని వారి కుటుంబాలకు తీరని శోకాన్ని మిగిలిస్తున్నారు.

    ప్రైవేట్ అంబులెన్సుల దోపిడీని కట్టడి చేసేవారేరీ..
    కార్పొరేట్ ఆస్పత్రుల కాసుల కక్కుర్తి బాటలోనే ప్రైవేట్ అంబులెన్సులు కూాడా నడుస్తున్నాయి. కార్పొరేట్ ఆస్పత్రులు కరోనా పేషంట్లను బ్రతికుండగానే పీల్చిపిప్పి చేస్తుండగా.. ప్రైవేట్ అంబులెన్స్ నిర్వాహాకులు కరోనా శవాలపై కాసులదందాకు పాల్పడుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రైవేట్ అంబులెన్స్ డ్రైవర్ల దందా మితిమీరిపోయిందనే ప్రచారం జరుగుతోంది. గాంధీ, నిమ్స్ , కింగ్ కోఠి, ఉస్మానియాతోపాటు పలు ప్రైవేట్ ఆస్పత్రుల్లో ప్రభుత్వం కోవిడ్ చికిత్సలకు అనుమతి ఇచ్చింది. ఈ ప్రాంతాల్లోనే ప్రైవేట్ అంబులెన్స్ నిర్వాహాకులు అత్యధికంగా తిష్ట వేస్తున్నారు. ఈ ప్రాంతంలో దాదాపు 550పైగా ప్రైవేట్ అంబులెన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. కరోనా రోగి పరిస్థితి విషమించగానే ఈ సమాచారం అంబులెన్స్ నిర్వహాకులు వెళుతుంది. ప్రైవేట్ అంబులెన్సులు ఈ ప్రాంతాలకు చేరుకొని బేరసారాలు సాగిస్తాయి.

    కరోనా శవాలపై ఏమాత్రం కనికరం లేకుండా నిర్వహాకులంతా ఒకే మాటపై ఉంటారని తెలుస్తుంది. హైదరాబాదులో కరోనాతో రోగి చనిపోతే 10 కిలోమీటర్ల దూరానికైతే రూ10వేలు, 20కిలోమీటర్ల దూరానికి రూ.20వేలు, శివారు ప్రాంతాలకు 50కిలోమీటర్ల లోపు దూరమైతే రూ.25నుంచి రూ.30వేలు, వంద కిలోమీటర్లు, ఆపై దూరానికి రూ.40నుంచి రూ.50వేల వరకు వసూలు చేస్తున్నారని బాధితులు వాపోతున్నారు. ఇటీవల గాంధీ నుంచి కరోనా శవాన్ని మెదక్ తరలించేందుకు ప్రైవేట్ అంబులెన్స్ నిర్వహాకులు 40వేలు డిమాండ్ చేయగా చివరకు రూ.35వేలకు ఒప్పుకున్నారట. అదేవిధంగా గాంధీకి 8కిలోమీటర్ల దూరంలో ఉన్న తిరుమలగండికి ఓ శవాన్ని తరలించేందుకు రూ.15వేలు ప్రైవేట్ అంబులెన్స్ నిర్వాహాకులు వసూలు చేశారని బాధితులు వాపోతున్నారు.

    Also Read: రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత మెట్రో అక్కడే!

    కార్పొరేట్ ఆస్పతుల్లో లక్షల్లో బిల్లు చెల్లించి ప్రాణం దక్కించుకోలేక దీనస్థితిలో ఉన్నవారి నుంచి శవాలను కొద్దిపాటి దూరం తరిలించేందుకు అంబులెన్స్ డ్రైవర్లు వేలల్లో ఛార్జి చేస్తుండటంపై అమానుషంగా మారింది. ప్రభుత్వం దృష్టికి ఈ సంఘటనలు వెళ్లినా పట్టించుకోకుండా ప్రేక్షక పాత్ర పోషిస్తుందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కరోనా పరిస్థిత్లుల్లో ప్రజలంతా ఆర్థికంగా చితికిపోతున్నవేళ కొందరు శవాలపై కాసుల కక్కుర్తికి పాల్పడుతూ మానవత్వాన్ని మంటగలుపుతున్నారు. కరోనా రోగులు, శవాలపై జరుగుతున్న దోపిడీని అరికట్టేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. దీనిపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాల్సిందే..!