https://oktelugu.com/

అమెరికా ఉపాధ్యక్ష అభ్యర్థిగా భారతీయ సంతతి మహిళ

భారత సంతతి మహిళ కమలా హ్యారీస్ అమెరికాలో సరికొత్త రికార్డు సృష్టించింది. అమెరికా ఉపాధ్యక్ష బరిలో నిలిచిన తొలి భారత సంతతి మహిళగా, తొలి నల్లజాతీయురాలిగా కమలా హ్యారీస్ నిలిచింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో నల్లజాతీయులు, భారత సంతతి ఓట్లు కీలకంగా మారాయి. దీంతో కాలిపోర్నియా సెనేటర్ కమలా హ్యారిస్ ను డెమొక్రాట్ల వైస్ ప్రెసిడెంట్ గా ఆ పార్టీ మంగళవారం ప్రకటించి అధ్యక్ష ఎన్నికను రసవత్తరంగా మార్చింది. Also Read: రేపు విడుదల కానున్న రష్యా […]

Written By:
  • Neelambaram
  • , Updated On : August 12, 2020 / 02:38 PM IST
    Follow us on


    భారత సంతతి మహిళ కమలా హ్యారీస్ అమెరికాలో సరికొత్త రికార్డు సృష్టించింది. అమెరికా ఉపాధ్యక్ష బరిలో నిలిచిన తొలి భారత సంతతి మహిళగా, తొలి నల్లజాతీయురాలిగా కమలా హ్యారీస్ నిలిచింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో నల్లజాతీయులు, భారత సంతతి ఓట్లు కీలకంగా మారాయి. దీంతో కాలిపోర్నియా సెనేటర్ కమలా హ్యారిస్ ను డెమొక్రాట్ల వైస్ ప్రెసిడెంట్ గా ఆ పార్టీ మంగళవారం ప్రకటించి అధ్యక్ష ఎన్నికను రసవత్తరంగా మార్చింది.

    Also Read: రేపు విడుదల కానున్న రష్యా వ్యాక్సిన్.. ‘కరోనా’కు చెక్!

    అమెరికా అధ్యక్ష రేసులో రిపబ్లిక్ పార్టీ తరుఫున డోనాల్డ్ ట్రంప్, డెమొక్రాట్ అభ్యర్థిగా జో బిడెన్ పోటీ పడుతున్న సంగతి తెల్సిందే. నవంబర్లో జరిగే అధ్యక్ష ఎన్నిక కోసం ఇరుపార్టీలు ఇప్పటి నుంచే వ్యూహాలు రచిస్తున్నారు. ఇందులో భాగంగా డెమొక్రాట్ పార్టీ తమ అమెరికా వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థిగా భారత సంతతి మహిళ, నల్లజాతీయురాలైన కాలిపోర్నియా సెనేటర్ కమలా హ్యారిస్ ను వ్యూహాత్మకంగా బరిలో నిలిపింది.

    భారత సంతతి అయిన కమలా హ్యారిస్ కు తమిళ మూలలున్నాయి. హ్యారిస్ తల్లి శ్యామలా గోపాలన్ చెన్నైలో జన్మించారు. వృత్తిపరంగా వైద్యురాలైన శ్యామలా కాలిఫోర్నియాలోని ఓక్లాండ్లో స్థిరపడ్డారు. ఆ తర్వాత జమైకాకు చెందిన హ్యారిస్ ను పెళ్లి చేసుకున్నారు. శ్యామలా-హరీష్ దంపతులకు 1964 అక్టోబర్ 20న కమలా హ్యారీస్ జన్మించారు. కమలా హ్యారిస్ విద్యాభ్యాసం తర్వాత న్యాయవాద వృత్తిలో స్థిరపడ్డారు.

    Also Read: కరోనాను ఆ దేశం తరిమికొట్టిందా?

    ఓవైపు న్యాయవాద వృత్తి కొనసాగిస్తూనే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. 2003లో శాన్ ఫ్రాన్సిస్కో జిల్లా అటార్నీగా కమలా హ్యారీస్ విజయం సాధించారు. ఇటీవల కార్నిఫోర్నియా నుంచి బరిలో దిగి గెలుపొందారు. ఇక తొలి ప్రయత్నంలోనే కమలా హ్యారీస్ యూఎస్ సెనెట్‌ గా ఎంపికైంది. తాజాగా అమెరికా ఉపాధ్యక్ష బరిలో నిలువడం గమనార్హం. ఓ పెద్ద పార్టీ తరఫున అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీచేస్తున్న నాలుగో మహిళగా కమలా హ్యారిస్ రికార్డు సృష్టించింది.

    డెమొక్రాట్ పార్టీ నుంచి అమెరికా ఉపాధ్యక్ష బరిలో కమల హ్యారీస్ పేరు రావడంపై ఆమె సంతోషం వ్యక్తం చేసింది. ఈమేరకు డెమొక్రాట్ల తరపున అమెరికా అధ్యక్ష బరిలో నిలిచిన జో బిడెన్ కు ధన్యవాదాలు వ్యక్తం చేసింది. జో బిడెన్ అమెరికన్ ప్రజల కోసమే తన జీవితాంతం పోరాడుతున్నారని.. ఆయన ఆదర్శమైన అమెరికాను నిర్మిస్తారనే ఆశాభావాన్ని కమలా హ్యారీస్ తెలిపారు. పార్టీ తనకు అప్పగించిన బాధ్యతలు పూర్తి స్థాయిలో నిర్వహిస్తానని తెలిపారు.