
జమిలి ఎన్నికలు దగ్గర్లోనే ఉన్నాయంటూ ఇటీవల టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు వ్యాఖ్యలు చేశారు. మళ్లీ తాము అధికారంలోకి వస్తామంటూ చెప్పుకొచ్చారు. అయితే.. నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా శాసన వ్యవహారాల ప్రిసైడింగ్ అధికారుల సదస్సులో ప్రధాని కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు చంద్రబాబుకు బూస్టింగ్‌లా మారాయి. అవేటంటే.. జమిలి ఎన్నికలపై మోడీ పాజిటివ్‌గా స్పందించడమే.
Also Read: ప్రధాని మోడీ సడెన్ గా హైదరాబాద్ టూర్ వెనుక కారణమేంటి?
దేశంలో జమిలి అంటే ఒకే దేశం, ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్రం సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే.. దీనిపై మోడీ కూడా చెప్పకనే చెప్పారు. జమిలీ ఎన్నికలు అనేది కేవలం చర్చకే పరిమితం కాకుండా అమలుపై సీరియస్‌గా చర్చించాలని ప్రధాని పిలుపునిచ్చారు. జమిలి ఎన్నికలు భారత్‌కు ఎంతో అవసరమన్నారు. వేర్వేరు చోట్ల నెలల తరబడి ఎన్నికలు నిర్వహిస్తుండడంతో అభివృద్ధి పనులపై ప్రభావం పడుతోందన్నారు. వీటి కోసం డబ్బు, సమయం ఎందుకు వృథా చేసుకోవాలని ఆయన ప్రశ్నించారు. ప్రస్తుత కాలంలో వేర్వేరు ఓటరు జాబితాలు అవసరం లేదని ప్రధాని అన్నారు. లోక్‌సభ, అసెంబ్లీతోపాటు పంచాయతీ ఎన్నికల వరకు అన్నింటికీ ఒకే ఓటరు జాబితా ఉండాలని ప్రిసైడింగ్ అధికారులకు ప్రధాని సూచించారు. రాజకీయ లక్ష్యాల కంటే దేశాభివృద్ధి, ప్రజాశ్రేయస్సే ప్రాధాన్యతగా ఉండాలని ప్రిసైడింగ్ అధికారులకు ప్రధాని సూచించారు.
ఇప్పుడు ఏకంగా ప్రధాని నోట జమిలి ఎన్నికల ప్రస్తావన రావడంతో చంద్రబాబుకు రాజకీయంగా ఆక్సిజన్ ఇచ్చినట్టైంది. అసలే జగన్ దెబ్బకు ఊపిరాడక ఉక్కిరిబిక్కిరి అవుతున్న టీడీపీ నేతలు, శ్రేణులకు ప్రధాని మాటలు ఎంతోకొంత బలాన్ని ఇచ్చాయనడంలో ఎలాంటి అనుమానాలు లేవు. ఇక రేపటి నుంచి ఏపీ ప్రతిపక్షాలతోపాటు పచ్చ మీడియా కూడా ఈ జమిలి ఎన్నికల టాపిక్‌నే ప్రధాన చర్చకు తీసుకుంటాయేమో.
Also Read: న్యాయవ్యవస్థపై తమ్మినేని సంచలన కామెంట్స్..!
త్వరలో ఎన్నికలు జరిగి, జగన్‌ను ఓడిస్తామనే నినాదంతో శ్రేణుల్లో మనోస్థైర్యం నింపేందుకు టీడీపీతో బీజేపీ–-జనసేన కూటమి కూడా జనంలోకి వెళ్లడం కూడా ఖాయం. ప్రధాని జమిలి ఎన్నికల గురించి మాట్లాడం, దానిపై ఇప్పటి నుంచి పచ్చ బ్యాచ్ హడావుడి చేయడం చూస్తుంటే.. మున్ముందు ఏపీ రాజకీయాలు ఎంత హాట్‌హాట్‌గా మారబోతున్నాయో ఆసక్తిగా మారింది.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్