Modi: ఇరాన్ అధ్యక్షుడిని తలచుకొని ప్రధాని మోడీ సంచలన కామెంట్స్..

మరోవైపు ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం మృతిపై భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఇబ్రహీం రైసీ ఒక డైనమిక్ లీడర్ అంటూ.. ప్రశంసించారు. ఈ సందర్భంగా ఆయనతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.

Written By: Neelambaram, Updated On : May 20, 2024 3:26 pm

ModI

Follow us on

Modi: ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసి మృతి ప్రపంచ వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. రైసి మృతి వెనక ఏ దేశమైనా కుట్ర చేసి ఉంటుందా..? అనే అనుమానాలను..ఇరానీయన్ మిలటరికి సంబంధించిన ఐఆర్జిసి వ్యక్తం చేస్తోంది. ఇప్పటికే రైసీ మృతి చెందిన ప్రాంతంలో టర్కీకి చెందిన అత్యంత అధునాతన యూఏడి మానవ రహిత డ్రోన్ ను ఐఆర్జిసి కనుక్కున్నట్లు పలు అంతర్జాతీయ మీడియా సంస్థలో వార్తలు వస్తున్నాయి. కూలిపోయిన రైసీ చాపర్ కోసం ఇరానీయన్ భద్రతా దళాలు అజర్ బైజాన్ సరిహద్దుల్లో సెర్చ్ ఆపరేషన్ ను చేసినప్పుడు ఈ డ్రోన్ ను కనుగొన్నట్లు ఆదేశం చెబుతోంది. దీంతో రైసి మృతిపై మరింతగా అనుమానాలు బలపడుతున్నాయి.

మరోవైపు ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం మృతిపై భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఇబ్రహీం రైసీ ఒక డైనమిక్ లీడర్ అంటూ.. ప్రశంసించారు. ఈ సందర్భంగా ఆయనతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ఇరాన్-భారత్ మధ్య అనేక కీలకమైన ఒప్పందాలు జరిగాయి. ఇరాన్ లోని చాబహార్ పోర్టును ఇండియా అభివృద్ధి చేస్తుంది. ఇందుకోసం ఇప్పటికే నాలుగు వేల కోట్లను ఖర్చు చేసింది. మరో రెండు వేల కోట్లలను పెట్టుబడులుగా పెడుతుంది. ఈ పోర్టు ద్వారా ఆఫ్ఘనిస్తాన్,మధ్య ఆసియా దేశాలకు ఎగుమతులు.. దిగుమతులను సులభంగా కొనసాగించవచ్చని భారత్ భావిస్తుంది.

దీంతో పాటు ఇరాన్ అధ్యక్షుడిగా ఇబ్రహీం రైసీ సహకారంతోనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదేశానికి బియ్యాన్ని ఎగుమతి చేయించి వాటి స్థానంలో చమురును దిగుమతి చేయించుకున్నారు. ఫలితంగా ఈ రెండు దేశాల మధ్య మంచి ఆర్థిక,దౌత్య సంబంధాలు ఏర్పడ్డాయి. అయితే ఇప్పుడు హఠాత్తుగా హెలిక్యాప్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ మృతి చెందడం తన తీవ్రంగా కలచి వేసిందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విచారం వ్యక్టం చేస్తున్నారు.