Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అప్ కమింగ్ మూవీలో ఓ కీలక పాత్ర కోసం సీనియర్ బ్యూటీని సంప్రదించగా ఆమె చేయనన్నారట. పవన్ కళ్యాణ్ వంటి టాప్ హీరో మూవీని రిజెక్ట్ చేసిన ఆ హీరోయిన్ ఎవరో చూద్దాం. పవన్ కళ్యాణ్ మొన్నటి వరకు రాజకీయంగా బిజీ. ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. కూటమి అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ పిఠాపురం నుండి పోటీ చేశారు. ఈసారి ఎన్నికల్లో టీడీపీ+బీజేపీ+జనసేన ఉమ్మడిగా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన క్షణం తీరిక లేకుండా గడిపారు.
జూన్ 4 ఎన్నికల ఫలితాలు రానున్నాయి. అనంతరం పవన్ కళ్యాణ్ నటుడిగా తిరిగి బిజీ కానున్నాడు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న మూడు ప్రాజెక్ట్స్ సెట్స్ పై ఉన్నాయి. హరి హర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ కొంత మేర షూటింగ్ జరుపుకున్నాయి. పాన్ ఇండియా మూవీ హర హర వీరమల్లు నుండి దర్శకుడు క్రిష్ తప్పుకున్నాడు. మరొక దర్శకుడు హర హర వీరమల్లు రెండు భాగాలకు దర్శకత్వం వహించనున్నాడు
కాగా దర్శకుడు సుజీత్ తెరకెక్కిస్తున్న ఓజీ పై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. ఓ జీ చిత్ర ప్రోమోలు విపరీతంగా ఆకటున్నాయి. పీరియాడిక్ గ్యాంగ్ స్టర్ డ్రామా ఓజీ తెరకెక్కుతుంది. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి ఓ ఆసక్తికర వార్త తెరపైకి వచ్చింది .ఓజీ చిత్రంలో ఓ కీలక రోల్ కోసం సీనియర్ హీరోయిన్ టబుని సంప్రదించారట. అయితే ఆమె సున్నితంగా తిరస్కరించారట. టబు పాత్ర నెగిటివ్ షేడ్స్ కలిగి ఉంటుందట. పాత్రకు వెయిట్ ఉన్నప్పటికీ టబు చేయనున్నారట. ఈ న్యూస్ వైరల్ అవుతుంది.
టబు ఇటీవల కాలంలో అల వైకుంఠపురంలో నటించింది. అల్లు అర్జున్ తల్లి పాత్ర చేసింది. ఆమె క్యారెక్టర్ రోల్స్ చేస్తున్న క్రమంలో ఓజీ మూవీ కోసం సంప్రదించగా ఆమె చేయనన్నారట . మరొక సీనియర్ నటి కోసం వెతుకులాట స్టార్ట్ చేశారట. ఓజీ చిత్రాన్ని ఆర్ ఆర్ ఆర్ నిర్మాత డీవీవీ దానయ్య నిర్మిస్తున్నాడు. పవన్ కళ్యాణ్ కి జంటగా ప్రియాంక అరుళ్ మోహన్ నటిస్తుంది.