Presidential Election 2022 Results: రాష్ట్రపతి ఎన్నికల ఫలితం కొద్ది సేపట్లో తేలనుంది. ఎన్డీయే పక్షాల అభ్యర్థిగా ద్రౌపది ముర్ము, విపక్షాల అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా పోటీలో ఉన్నారు. ద్రౌపది ముర్ముకే విజయావకాశాలు ఎక్కువగా ఉండటంతో ఆమె గెలుపు లాంఛనమే అని తెలుస్తోంది. కానీ బ్యాలెట్ పేపర్లు లెక్కించి తుది నిర్ణయం వెల్లడిస్తారు. ఈ నేపథ్యంలో ఫలితాలపై అందరికి ఆసక్తి కలుగుతోంది. తుది ఫలితం వెలువడే వరకు ఉత్కంఠగా చూస్తున్నారు. ఇప్పటికే బ్యాలెట్ బాక్సులు పార్లమెంట్ కు చేరాయి. మరికొద్ది గంటల్లోనే ఫలితం వెల్లడయ్యే అవకాశం ఉంది.

ద్రౌపది ముర్ము గెలిస్తే రెండు ఘనతలు సాధిస్తుంది. మొట్టమొదటి గిరిజన మహిళ రాష్ట్రపతిగా ఎన్నిక, ఈ పదవిని పొందే రెండో మహిళగా రికార్డు సృష్టిస్తుంది. దీంతో అందరిలో ఒకటే ఆతృత ఏర్పడింది. ప్రస్తుత రాష్ట్రపతి పదవీ కాలం ఈనెల 24తో ముగుస్తుంది. 25న నూతన రాష్ర్టపతి ప్రమాణ స్వీకారం ఉంటుంది. దీంతో కాబోయే రాష్ట్రపతి అభ్యర్థి కోసం అందరు వేచి చూస్తున్నారు. ఈనెల 18న పార్లమెంట్ తోపాటు రాష్ట్రాల్లోని అసెంబ్లీల్లో రాష్ట్రపతి ఎన్నిక జరిగింది. తరువాత బ్యాలెట్ బాక్సులను పార్లమెంట్ కు చేర్చారు.
Also Read: Akhil Agent: అఖిల్ యాక్టింగ్ పై డైరక్టర్ సీరియస్.. ‘ఏజెంట్’ పరిస్థితి ఏమిటి ?
తొలుత ఎంపీల ఓట్లు లెక్కిస్తారు. తరువాత ఎమ్మెల్యేల ఓట్లు లెక్కగడతారు. ఎంపీ ఓట్లు లెక్కించాక ఫలితాలు ప్రకటిస్తారు. తరువాత ఎమ్మెల్యేల ఓట్ల లెక్కింపులో పది రాష్ట్రాలకు ఒకసారి ఎన్నికల సరళి ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. దీంతో తుది ఫలితంపైనే అందరికి గురి ఏర్పడిది. ఎవరు పోటీలో నెగ్గితే వారికి పదవి దక్కనుంది. దీంతో ద్రౌపది ముర్ము, యశ్వంత్ సిన్హాలో ఎవరిని అదృష్టం వరిస్తుందో తెలియడం లేదు. ఈ క్రమంలో రాష్ట్రపతి ఎన్నికపై అందరికి ఉత్సుకత ఏర్పడింది.

ద్రౌపది ముర్ము సొంతూరులో విజయోత్సవాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. తుది ఫలితం ప్రకటించగానే బ్యాండు మేళాలు, ర్యాలీలు నిర్వహించి ఆమెకు సంఘీభావం తెలిపేందుకు సిద్ధమయ్యారు. ఒడిశా వ్యాప్తంగా హోర్డింగులు, బ్యానర్లు దర్శనమిస్తున్నాయి. దీంతో ద్రౌపది ముర్ము కు మద్దతుగా అభిమానులు సందడి చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు అంతా సిద్ధం చేసుకున్నారు. ఫలితం వెలువడగానే ప్రజలు ఒక్కసారిగా ముర్ము ఫొటోలు, ఫ్లెక్సీలతో రాష్ట్రమంతా తిరిగేందుకే నిర్ణయించుకున్నట్లు సమాచారం.
Also Read:Producers Worried About Extra Cost: హీరోల అదనపు ఖర్చులకు నిర్మాతలు గగ్గోలు