https://oktelugu.com/

బహిరంగ సభకు రెడీ అవుతున్న ప్రవీణ్ కుమార్..

ఆరు నెలలు సర్వీసు ఉండగానే స్వచ్ఛంధంగా రిటైర్ అయిన ఐపీఎస్ అధికారి ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పీలోకి చేరేందుకు రెడీ అవుతున్నారు. వచ్చే నెల 8న బీఎస్పీ నిర్వహించే బహిరంగ సభలో ఆయన పార్టీ కండువా కప్పుకోనున్నారు. ఈ నేపథ్యా ఆయన మద్దతుదారులు ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గురుకుల మాజీ విద్యార్థులు, స్వేరోస్ సభ్యులంతా కలిసి ప్రవీణ్ కుమార్ సభకు జనాన్ని తీసుకొచ్చేలా ప్రయత్నాలు సాగిస్తున్నారు. అయితే దళిత సమాజం కోసం మాత్రమే పనిచేయడానికి […]

Written By:
  • NARESH
  • , Updated On : July 29, 2021 / 01:38 PM IST
    Follow us on

    ఆరు నెలలు సర్వీసు ఉండగానే స్వచ్ఛంధంగా రిటైర్ అయిన ఐపీఎస్ అధికారి ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పీలోకి చేరేందుకు రెడీ అవుతున్నారు. వచ్చే నెల 8న బీఎస్పీ నిర్వహించే బహిరంగ సభలో ఆయన పార్టీ కండువా కప్పుకోనున్నారు. ఈ నేపథ్యా ఆయన మద్దతుదారులు ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గురుకుల మాజీ విద్యార్థులు, స్వేరోస్ సభ్యులంతా కలిసి ప్రవీణ్ కుమార్ సభకు జనాన్ని తీసుకొచ్చేలా ప్రయత్నాలు సాగిస్తున్నారు.

    అయితే దళిత సమాజం కోసం మాత్రమే పనిచేయడానికి బీఎస్పీలో చేరుతున్నట్లు ప్రవీణ్ కుమార్ ప్రకటించారు. అంతకుముందు హుజూరాబాద్ ఉప ఎన్నికలో పోటీ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయని, అయితే అందులో నిజం లేదన్నారు. నాపై దుష్ప్రచారం చేయడానికే కొందరు కంకణం కట్టుకున్నారని ఆరోపించారు. బహుజనుల కోసం అంబేద్కర్ బాటలో నడవాలని నిర్ణయించుకున్నట్లు ప్రవీణ్ కుమార్ పలు ఇంటర్వ్యూల్లో పేర్కొన్నారు.

    తనపై ఇప్పటికే కేసులు నమోదయ్యాయని, అయినా తాను భయపడకుండా బహుజనుల కోసం పోరాటం చేస్తానని అన్నారు. పలు రంగాల్లో బహుజనులు చాలా వెనుకబడి ఉన్నారని, విద్యావంతులు కాకపోవడమే ఇందుకు ప్రధాన కారణమని అన్నారు. బహుజనులు అభివృద్ధి చెందితేనే సమాజం అభివృద్ధి చెందుతుందని అందుకోసమే తాను అంబేద్కర్ బాటలో నడవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.

    ఈ నేపథ్యంలో నల్గొండ జిల్లాలో సభను ఏర్పాటు చేసి ఇక్కడి నుంచే రాజకీయ ప్రస్థానం ప్రారంభించేలా ప్రవీణ్ కుమార్ మద్దతుదారులు రెడీ అవుతున్నారు. మొత్తంగా లక్షన్న మందిని ఈ సభకు తీసుకొచ్చేలా వ్యూహం పన్నుతున్నారు. ఇప్పటికే ఉమ్మడి జిల్లాల్లోని ఆయా నియోజకవర్గాల్లో పర్యటిస్తూ ప్రజలకు వివరిస్తున్నారు. సభకు రావాలని కోరుతున్నారు. అయితే సభకు వచ్చేవారు తమ ఖర్చు తామే భరించుకోవాలని కోరుతున్నారు. భోజనం ఖర్చు కూడా తామే భరించుకోవాలని సూచిస్తున్నారు.