ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులను పరిశీలిస్తే అత్యధికంగా అమెరికాలోనే కేసులు నమోదు అవుతున్నట్లు తెలుస్తోంది. జులై 25తో ముగిసిన వారంలో అగ్రరాజ్యంలో 5 లక్షలకు పైగా కేసులు వెలుగు చూశాయి. అంతకుముందు వారంతో పోల్చితే ఇది 131 శాతం ఎక్కువ కావడం గమనార్హం. ప్రస్తుతం అక్కడ వారానికి సగటు కొత్త కేసుల సంఖ్య 60 వేలకు పైగా ఉంటోంది. జూన్ నెలతో పోలిస్తే ఇది నాలుగు రెట్లు ఎక్కువ.
దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ మందగించడంతోనే కేసుల సంఖ్య పెరుగున్నాయని తెలుస్తోంది. కరోనా ఉధృతికి వ్యాక్సినేషన్ ప్రక్రియ నెమ్మదించడమే కారణమని నిపుణులు వెల్లడిస్తున్నారు. అమెరికాలోని పలు ప్రాంతాల్లో కొవిడ్ నిబంధనలు అమల్లోకి వస్తున్నాయి. వైరస్ తీవ్రత కారణంగా మాస్కులు ధరించాలని సూచిస్తోంది. ప్రజలు గుంపులుగా తిరగొద్దని చెబుతున్నారు.
కరోనా వల్ల ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ ప్రభావితమైన దేశం అమెరికానే. కరోనా వైరస్ తో గడగడలాడిన దేశం ఎంతో నష్టపోయింది. ఇక్కడ ఇప్పటివరకు 6.12 లక్షల మందిని బలితీసుకుంది. దాదాపు 3.5 కోట్ల మంది వైరస్ బారిన పడ్డారు. దీంతో కరోనా ప్రభావంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. తమ ప్రాణాలు గాల్లో కలుస్తున్న వైనంపై నానా తిప్పలు పడుతున్నారు. వైరస్ బారిన పడకుండా ఉండేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.