Prashant Kishore Survey
Prashant Kishore Survey: ఏపీలో వచ్చే ఎన్నికల్లో గెలుపు ఎవరిది? ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే చర్చ నడుస్తోంది. ఇటీవల సర్వేలన్నీ వైసీపీకి అనుకూలంగా ఉన్నా.. ఆ పార్టీలో మాత్రం సానుకూలత కనిపించడం లేదు. ఎక్కడో ఏదో తేడా కొడుతుందని కేడర్ ఆందోళన చెందుతోంది. ఇటువంటి తరుణంలో సోషల్ మీడియాలో ప్రశాంత్ కిషోర్ సర్వే పేరిట గణాంకాలు వైరల్ అవుతున్నాయి. మూడు ఎంపీ స్థానాల్లో మినహా.. మిగతా చోట్ల ప్రతికూల పరిస్థితులు నెలకొని ఉన్నట్లు ఈ సర్వే తెలియజేస్తోంది. ఇప్పుడు ఈ సర్వే నే వైరల్ గా మారింది.
వాస్తవానికి ప్రశాంత్ కిషోర్ జగన్ కు వ్యూహకర్త గా పని చేశారు. ఇప్పటికీ జగన్ తో సన్నిహిత సంబంధాలే కొనసాగిస్తున్నారు.దీంతో వైసిపి గెలుపు గుర్రాల కోసం పీకేతో సర్వే చేయించినట్లు తెలుస్తోంది. అయితే ఈ సర్వే ఫలితాలు వైసిపి నేతల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నట్లు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ సర్కార్ తీరుపై తీవ్ర వ్యతిరేకత ఉన్నట్లు ఈ సర్వే తేల్చింది. ఇప్పటికే ఈ సర్వే ఫలితాన్ని అనుసరించి కొంతమంది ఎమ్మెల్యేలను జగన్ పక్కకు తప్పిస్తారని సమాచారం. తీవ్ర ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్న వారిలో ఎమ్మెల్యేలతో పాటు మంత్రులు కూడా ఉన్నారు. వారందరికీ టిక్కెట్లు ఇస్తే అసలు వదులుకోవాల్సిందేనని పీకే సర్వే తేల్చినట్లు సమాచారం. దీనిపై జగన్ సైతం తర్జనభర్జన పడుతున్నట్లు తెలుస్తోంది.
గత ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా 22 ఎంపీ స్థానాలను వైసీపీ గెలుచుకున్న సంగతి తెలిసిందే. అయితే అందులో 16 మంది ఎంపీల పై తీవ్ర వ్యతిరేకత ఉన్నట్లు సమాచారం. వారు మరోసారి బరిలో దిగితే ఓటమి ఖాయమని ఈ సర్వే తేల్చింది. కర్నూలు,నంద్యాల, నరసరావుపేట, నెల్లూరు,ఒంగోలు, తిరుపతి పార్లమెంట్ స్థానాల్లో పోటీ హారహోరీగా సాగుతుంది. కడప, రాజంపేట, అరకు పార్లమెంటు స్థానాలు మాత్రమే వైసీపీకి ఓకింత మొగ్గు ఉంటుంది. ఇక పోటా పోటీ ఉంటుందన్న స్థానాల్లో సైతం టిడిపి వైపే కాస్త మొగ్గు కనిపిస్తోంది. గత ఎన్నికల్లో టిడిపి గెలుపు పొందిన విజయవాడ, గుంటూరు, శ్రీకాకుళం స్థానాల్లో సైతం వైసీపీకి గెలుపు అవకాశాలు లేనట్లు సర్వే తేల్చింది.
ఈ సర్వే వైసిపి నేతల నుంచి లీక్ అయినట్లు సమాచారం. దీనిపై పూర్తిస్థాయి నివేదికలు ఒకటి రెండు రోజుల్లో జగన్కు చేరే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. రెండుసార్లు వడపోసి ఈ సర్వే చేపట్టినట్లు సమాచారం. జాతీయ మీడియా సంస్థలు చేసిన సర్వేలన్నీ ఏకపక్షంగా ఉన్నాయి. వైసిపి క్లీన్ స్వీప్ చేస్తుందని చెప్పుకొచ్చాయి. వీటిని వైసీపీ శ్రేణులే నమ్మడం నమ్మడం లేదు. ఇటువంటి తరుణంలో ప్రశాంత్ కిషోర్ సర్వే అధికార పార్టీ నేతలు వణుకు పుట్టిస్తోంది. టిడిపి శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. పీకే సర్వే లీక్ అయ్యిందంటూ సోషల్ మీడియాలో పోస్టులను వైరల్ చేస్తున్నారు.