పీకే సంచలనం.. కాంగ్రెస్ తో ముందుకు?

దేశంలో రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తమిళనాడు, పశ్చిమ బెంగాల్ లో విజయం సాధించిన తరువాత ప్రస్తుతం రాబోయే ఎన్నికల కోసం వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. గాంధీ కుటుంబంతో సమావేశం అయ్యాక మూడో కూటమిపై ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. 2024 ఎన్నికలే లక్ష్యంగా పని చేస్తున్నారు. ఇప్పటికే ఎన్సీపీ నేత శరత్ పవార్ నాయకత్వంలో నాన్ కాంగ్రెస్, నాన్ బీజేపీ నేతలను ఒకే వేదికపైకి తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేశారు. […]

Written By: Srinivas, Updated On : July 16, 2021 10:50 am
Follow us on

దేశంలో రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తమిళనాడు, పశ్చిమ బెంగాల్ లో విజయం సాధించిన తరువాత ప్రస్తుతం రాబోయే ఎన్నికల కోసం వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. గాంధీ కుటుంబంతో సమావేశం అయ్యాక మూడో కూటమిపై ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. 2024 ఎన్నికలే లక్ష్యంగా పని చేస్తున్నారు. ఇప్పటికే ఎన్సీపీ నేత శరత్ పవార్ నాయకత్వంలో నాన్ కాంగ్రెస్, నాన్ బీజేపీ నేతలను ఒకే వేదికపైకి తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేశారు.

కాంగ్రెస్ లోకి రావాలని అధ్యక్షురాలు సోనియాగాంధీ ఆహ్మానించగా ప్రశాంత్ కిషోర్ తన నిర్ణయం ఇంకా చెప్పలేదు. నో కూడా చెప్పలేదు. కాంగ్రెస్ లోకి వస్తే సరైన గుర్తింపు, హోదా వస్తాయని కిషోర్ కు ఆఫర్ ఇచ్చారు. కాంగ్రెస్ లో చేరతారనే ప్రచారం సాగుతోంది. 2024 ఎన్నికల్లో బీజేపీని ఓడించమే లక్ష్యంగా ఎంచుకున్నారు. జాతీయ స్థాయిలో బీజేపీయేతర పార్టీల నేతలందరి నుంచి ప్రశాంత్ కిషోర్ రావాలని కోరుతున్నారు. త్వరలో జరిగే అయిదు స్టేట్ల ఎన్నికల్లో కాంగ్రెస్ ను గట్టెక్కించాలని చూస్తున్నట్లు సమాచారం.

బీజేపీని ఎదుర్కోవాలంటే కాంగ్రెస్ తోనే ముందుకు వెళ్లాలని పీకేకు తెలిసిందే. ఇప్పుడు పరోక్షంగా జగన్ కు, తనమాజీ టీం సభ్యులు షర్మిలకు సహకారం అందిస్తున్నారు. జగన్ నుసైతం తన వైపుకు తిప్పుకునేందుకు పీకే ప్రయత్నించే అవకాశాలు ఉన్నాయి. జగన్ తనను , తన కుటుంబాన్ని అవమానించి ఇబ్బందులు పెట్టిన కాంగ్రెస్ తోమాత్రం కలిసే అవకాశాలు ఎట్టి పరిస్థితుల్లో ఉండదని పార్టీనేతలు చెబుతున్నారు.

పశ్చిమబెంగాల్ ఎన్నికల తరువాత రాజకీయ వ్యూహకర్తగా పని చేయడం లేదని ప్రశాంత్ కిషోర్ ప్రకటించారు. జేడీయూలో పని చేసి ఉద్వాసనకు గురైన పీకే ఇప్పుడు రాజకీయంగా ఒక లక్ష్యం, కసితో పని చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. బీజేపీ తిరిగి అధికారంలోకి రాకుండా పని చేసేందుకు అన్ని అవకాశాలను తన శక్తిని సమర్థతను వినియోగిస్తున్నారు.