
హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. కోర్టు మాస్టర్లు, పర్సనల్ సెక్రటరీ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ ను విడుదల చేసింది. మొత్తం 25 ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుండగా జులై 21వ తేదీ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. https://hc.ap.nic.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం ఉంటుంది.
డిగ్రీ లేదా తత్సమాన కోర్సు పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంగ్లిష్‌లో నిమిషానికి 150 పదాలు షార్ట్‌హ్యాండ్ ఎగ్జామ్‌లో అర్హత సాధించి కంప్యూటర్ నైపుణ్యాలు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 18 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వారికి నెలకు 37,100 రూపాయలు వేతనంగ చెల్లిస్తారు. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ఆఫ్ లైన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రార్(అడ్మినిస్ట్రేషన్), హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్, నేలపాడు, అమరావతి, గుంటూరు–522237 అడ్రస్ కు దరఖాస్తులను పంపించాల్సి ఉంటుంది.
ఉద్యోగ ఖాళీలకు సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే వెబ్ సైట్ ద్వారా నివృత్తి చేసుకునే అవకాశం ఉంటుంది. నిరుద్యోగులకు ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రయోజనం చేకూరనుంది. వరుస జాబ్ నోటిఫికేషన్ల వల్ల నిరుద్యోగులకు మేలు జరగనుంది.