Prashant Kishor: దేశంలో కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరస్తోంది. రాబోయే ఎన్నికల్లో విజయం కోసం మార్గాలు అన్వేషిస్తోంది. ఇందులో బాగంగా ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ విధానాలు అమలు చేసేందుకు సిద్ధమైంది. దీనికి గాను ఆయన సారధ్యంలో ముందుకు నడిచేందుకు నిర్ణయించుకుంది. దీంతో పీకే ఇప్పటికే పలు సూచనలు చేశారు. ఏ ఏ పార్టీలతో కలిసి వెళ్తే మేలు చేకూరుతుందనే అంశాలపై ఆయన ఇప్పటికే దిశానిర్దేశం చేస్తున్నారు. పొత్తుల ఎత్తులపై వివరణ ఇస్తున్నారు. బీజేపీని ఎదుర్కొనే క్రమంలో అన్ని దారులు వెతుకుతున్నారు. బీజేపీని అధికారానికి దూరం చేయాలనే ఆలోచనతోనే ముందుకు సాగుతున్నారు. ఇందుకు పటిష్ట ప్రణాళికలు అమలు చేయనున్నట్లు తెలుస్తోంది.
ఈనేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో జగన్ తో పొత్తు పెట్టుకుంటామని చెబుతున్నారు, తెలంగాణలో మాత్రం ఒంటరిగానే పోటీ చేస్తామని ప్రకటించారు. దీంతో అసలు పీకే వ్యూహమేమిటని అందరిలో ఆశ్చర్యం వ్వక్తం చేస్తున్నారు. మరోవైపు తమిళనాడు, బెంగాల్, ఈశాన్య రాష్ట్రాలు, కేరళ తదితర చోట్ల పొత్తులు పెట్టుకోవడానికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో పీకే కనుసన్నల్లో కాంగ్రెస్ పార్టీని ప్రక్షాళన చేసి అధికారానికి దగ్గర చేయడమే లక్ష్యంగా కదులుతున్నట్లు సమాచారం. మొత్తానికి కాంగ్రెస్ పార్టీని ముందుండి నడిపించడంలో పీకే ఎంత మేరకు విజయం సాధిస్తారో అనే అనుమానాలు అందరిలో వస్తున్నాయి
Also Read: MS Dhoni: ధోనీ ప్లాన్ వేస్తే ఎవ్వరైనా ఔట్ కావాల్సిందే.. పోలార్డ్ విషయంలో మరోసారి నిరూపితం..
దేశంలో కాంగ్రెస్ పార్టీ గెలుపు సాద్యం కావాలంటే మార్పులు చాలా చేయాల్సి ఉంటుంది. దీని కోసమే పీకే పార్టీకి బలం చేకూర్చే విధంగా కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తోంది. అన్నిరాష్ట్రాల్లో ఒకటి రెండు పార్టీలతో పొత్తులకు సై అంటున్నారు. కాషాయ పార్టీని అధికారానికి దూరం చేసేందుకు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది ఇన్నాళ్లు అమిత్ షా పీకేను తేలిగ్గా తీసిపారేసినా ప్రస్తుతం వారి మధ్య ప్రత్యక్ష పోరు కొనసాగే వీలుంది ఇప్పటికే సొంత రాష్ట్రం గుజరాత్ లో అమిత్ షాకు పీకే మధ్య పోరు కొనసాగే అవకాశం ఉందని తెలుస్తోంది.
రాబోయే ఎన్నికలను అంత తేలిగ్గా తీసుకోవడం లేదు. అందుకే అన్ని పార్టీలు ఐక్యంగా ముందుకు నడిచేందుకు నిర్ణయించాయి. వచ్చే ఎన్నికల్లో అధికారం కోసమే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాయి దీనికి గాను ఇప్పటికే కార్యాచరణ ప్రకటిస్తున్నాయి. నేతల్లో నూతనోత్తేజం నింపేందుకు సిద్ధమయ్యాయి. మొత్తానికి పీకే కాంగ్రెస్ నావను ఒడ్డుకు చేరుస్తారా? లేక నడి సంద్రంలో వదిలేస్తారా ? అనేది తేలాల్సి ఉంది. కాంగ్రెస్ పార్టీలో ఒకరి పెత్తనం ఉండదు. సమష్టి నిర్ణయాలు అంటూ పార్టీని అధికారానికి దూరం చేసుకున్న ఘనత వారిదే. ఇకనైనా మేలుకుంటారా? చేసిన తప్పులే చేసి పాశ్చాత్తాప పడతారా ? అనే అనుమానాలు అందరిలో వస్తున్నాయి.
Also Read:MS Dhoni: మళ్లీ పాత ధోని.. బెస్ట్ ఫినిషర్ బయటకొచ్చాడు..
Recommended Videos: