మోడీ వ్యతిరేకులతో పీకే మీటింగ్స్. ఢిల్లీలో వేడెక్కిన రాజకీయం

దేశంలో మూడో కూటమి కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. బీజేపీయేతర పక్షాలతో జట్టు కట్టేందుకు ప్రశాంత్ కిషోర్ కసరత్తు ముమ్మరం చేశారు. కాంగ్రెస్ తోపాటు ప్రాంతీయ పార్టీలన్నింటిని ఏకతాటిపైకి తీసుకొచ్చే సన్నాహాలు చేస్తున్నారు. తృణమూల్ కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీలు ఇప్పటికే సుముఖత వ్యక్తం చేయగా ఎన్సీపీ అధినేత శరత్ పవార్ సైతం చేరేందుకు సిద్ధమయ్యారు మరో వారం రోజుల్లో కేసీఆర్ తోనూ చర్చలు జరిపే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పుడు అందరి దృష్టి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ […]

Written By: Srinivas, Updated On : June 12, 2021 4:33 pm
Follow us on

దేశంలో మూడో కూటమి కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. బీజేపీయేతర పక్షాలతో జట్టు కట్టేందుకు ప్రశాంత్ కిషోర్ కసరత్తు ముమ్మరం చేశారు. కాంగ్రెస్ తోపాటు ప్రాంతీయ పార్టీలన్నింటిని ఏకతాటిపైకి తీసుకొచ్చే సన్నాహాలు చేస్తున్నారు. తృణమూల్ కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీలు ఇప్పటికే సుముఖత వ్యక్తం చేయగా ఎన్సీపీ అధినేత శరత్ పవార్ సైతం చేరేందుకు సిద్ధమయ్యారు మరో వారం రోజుల్లో కేసీఆర్ తోనూ చర్చలు జరిపే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పుడు అందరి దృష్టి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ పై పడింది.

బీజేపీ వ్యతిరేక కూటమిలోకి జగన్ ను తీసుకు రావడానికి ప్రశాంత్ కిషోర్ ప్రయత్నాలు ప్రారంభించారు. కానీ జగన్ భారతీయ జనతా పార్టీతో లడాయి పెట్టుకునేందుకు సిద్ధంగా లేకపోవడంతో పీకే పాచిక పారుతుందో లేదో అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఈ పరిస్థితుల్లో జగన్ బీజేపీ వ్యతిరేక కూటమిలో చేరతారా అనే సందేహాలు వస్తున్నాయి. కానీ ప్రశాంత్ కిషోర్ పై జగన్ కు నమ్మకం ఉంది. దీంతో ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారోనని అందరు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బీజేపీని ఎదిరిస్తే భవిష్యత్తులో వచ్చే సమస్యలపై కలవరపడినా జగన్ స్టాండ్ మార్చుకోవచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు.

జగన్ బీజేపీ సిద్ధాంతాలకు ఆకర్షితుడైన వ్యక్తి కాదు. వాటిలో పుట్టిపెరిగిన వ్యక్తి కాదు. నిజం చెప్పాలంటే కాంగ్రెస్ రక్తం. బీజేపీతో సంబంధాలు నెరవేరడం లేదు. అదే బీజేపీకి గడ్డు పరిస్థితి ఎదురవుతుందని అనుకున్నప్పుడు ఆయన కూడా లెక్క చేయడం మానేస్తారు. అందులో ఎలాంటి సందేహం లేదు. బీజేపీకి గడ్డు పరిస్థితి వచ్చిందని జగన్ ను నమ్మించాల్సి ఉంది. మోడీ కన్నా పీకేను జగన్ ఎక్కువగా నమ్మితే మోడీ వ్యతిరేక కూటమికి బలం లభించినట్లేనని చెప్పుకోవచ్చు.