Prashant Kishor: తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సంచలన కామెంట్స్ చేశారు. హైదరాబాదులో జరిగిన ఎక్స్ప్రెస్ హైదరాబాద్ డైలాగ్స్ అనే చర్చ కార్యక్రమంలో ప్రశాంత్ కిషోర్ పాల్గొన్నారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న వేళ ఇంట్రెస్ట్ కామెంట్స్ చేశారు. ఏపీలో త్వరలో జరిగే ఎన్నికల్లో జగన్ ఓటమి ఖాయమని… భారీ మెజారిటీతో ఓడిపోబోతున్నారని తేల్చి చెప్పారు. వచ్చేది టిడిపి(TDP) జనసేన(Jansena) ప్రభుత్వమేనని తేల్చేశారు. చంద్రబాబు ముఖ్యమంత్రి పదవి చేపట్టడం ఖాయమని స్పష్టం చేశారు.
గత ఎన్నికల్లో వైసీపీకి వ్యూహ కర్తగా ప్రశాంత్ కిషోర్(Prashant Kishor) పనిచేశారు. వైసిపికి అంతులేని విజయం దక్కడం వెనుక పీకే కృషి ఉంది. అయితే ఎన్నికల అనంతరం ప్రశాంత్ కిషోర్ వైసీపీకి దూరమయ్యారు. సొంత రాష్ట్రం బీహార్లో రాజకీయ పార్టీని ఏర్పాటు చేయడంతో.. బిజీగా మారిపోయారు. ప్రస్తుతం వైసీపీకి గతంలో ప్రశాంత్ కిషోర్ సారథ్యం వహించిన ఐప్యాక్ టీం సేవలందిస్తోంది. ప్రశాంత్ కిషోర్ జగన్ తో సంబంధాలు తగ్గిపోయాయి. మొన్న ఆ మధ్యన నేరుగా విజయవాడ వచ్చి చంద్రబాబును పీకే కలిశారు. కీలక చర్చలు జరిపారు. పీకే టిడిపికి సేవలందిస్తారని అంతా భావించారు. కానీ అలా జరగలేదు. ఇప్పుడు అదే పీకేఏపీ ఎన్నికల్లో విజయంపై జోష్యం చెప్పడం విశేషం.
జగన్ ఎందుకు ఓడిపోతారో పీకే స్పష్టంగా విశ్లేషించారు. చదువుకున్న యువత ఉద్యోగాలు కోరుకుంటుందని.. ఉచితాలు కాదని పీకే అభిప్రాయపడ్డారు. జగన్ ఉపాధి అవకాశాల కల్పనపై కాకుండా ఉచితలపై దృష్టి పెట్టడం తప్పుడు చర్యగా అభివర్ణించారు. అందుకే ఆయనకు భారీ ఓటమి ఖాయమని తేల్చి చెప్పారు. పీకే చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి. ఆయన కామెంట్లపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వైసీపీ నేతలు భిన్న కామెంట్స్ చేస్తున్నారు.
వై నాట్ 175 అన్న నినాదంతో వైసిపి ముందుకెళ్తోంది. పెద్ద ఎత్తున అభ్యర్థులను మార్చుతోంది. ఇప్పుడు అదే ప్రశాంత్ కిషోర్ వైసీపీకి భారీ ఓటమి తప్పదని చెప్పి ఫ్యాన్ రెక్కలు విరిచినంత పని చేశారు. గతంలో ప్రశాంత్ కిషోర్ పేరుతో పెద్ద ఎత్తున హల్చల్ చేశాయి. ఇప్పుడు అవే ఫలితాలను గుర్తు చేస్తూ భారీ ఓటమి ఖాయమని తేల్చేశారు. అయితే పీకే వ్యాఖ్యలను వైసీపీ నేతలు కొట్టి పారేస్తున్నారు. ఆయన మాయల పకీరుల మాట్లాడుతున్నారంటూ తీవ్ర విమర్శలు చేస్తున్నారు. మొత్తానికైతే ఏపీ రాజకీయాల్లో పీకే కామెంట్స్ అగ్గి రాజేశాయి.