https://oktelugu.com/

‘ఇదే నేటి భారతం’ అంటూ కంగనాపై ప్రకాశ్ రాజ్ సెటైర్

బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ఇటీవల తరుచూ వార్తల్లో నిలుస్తోంది. ఫైర్ బ్రాండ్ గా పేరున్న కంగనా రనౌత్ అందుకు తగ్గట్టుగా వివాదాస్పద అంశాలపై స్పందిస్తుంది. బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ ఆత్మహత్య నేపథ్యంలో సంచలన వ్యాఖ్యలు చేసింది. బాలీవుడ్లోని నెపోటిజం కారణంగా సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపణలు గుప్పించింది. Also Read: జైలు అప్డేట్ :పాపం రియాకు దిండు కూడా గతిలేదా? ఈ నేపథ్యంలో కంగనా రనౌత్ మహరాష్ట్ర సర్కారుపై విమర్శలు చేసింది. దీంతో శివసేన […]

Written By:
  • NARESH
  • , Updated On : September 12, 2020 / 06:01 PM IST
    Follow us on

    బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ఇటీవల తరుచూ వార్తల్లో నిలుస్తోంది. ఫైర్ బ్రాండ్ గా పేరున్న కంగనా రనౌత్ అందుకు తగ్గట్టుగా వివాదాస్పద అంశాలపై స్పందిస్తుంది. బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ ఆత్మహత్య నేపథ్యంలో సంచలన వ్యాఖ్యలు చేసింది. బాలీవుడ్లోని నెపోటిజం కారణంగా సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపణలు గుప్పించింది.

    Also Read: జైలు అప్డేట్ :పాపం రియాకు దిండు కూడా గతిలేదా?

    ఈ నేపథ్యంలో కంగనా రనౌత్ మహరాష్ట్ర సర్కారుపై విమర్శలు చేసింది. దీంతో శివసేన నేతలు కంగనాపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ముంబైలోని కంగనా రనౌత్ ఇంటిని మహారాష్ట్ర సర్కార్ కక్ష్య సాధింపుతో కూల్చివేసింది. దీంతో శివసేన-కంగనా మధ్య మాటలయుద్ధం ఓ రేంజుల్లో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో బీజేపీ సర్కార్ కంగనాకు వై ప్లస్ కేటగిరి భద్రతను కల్పించింది.

    కంగనాకు బీజేపీ సర్కార్ వై ప్లస్ భద్రత కల్పించడంపై ప్రతిపక్షాలు, శివసేన నేతలు విమర్శించారు. సోషల్ మీడియా వేదికగా ఇరువర్గాలు ఒకరిపైఒకరు కామెంట్లు చేసుకుంటున్నారు. ఈ విషయంలో తాజాగా విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ తనదైన శైలిలో సైట్లర్లు వేసి ఆకట్టుకున్నాడు.

    లాక్డౌన్లో ఉపాధి లేక వలస కూలీలు వేలాది మైళ్లు నడుస్తున్న ఫొటో ఒకవైపు.. వై ప్లస్ కేటగిరి భద్రత మధ్య దర్జాగా నడిచి వెళుతున్న కంగనా రనౌత్ ఫొటో ఒకవైపు ఉంచి ‘ఇదే నేటి భారతం’ అంటూ ప్రకాశ్ రాజ్ సైటర్ వేశారు. వలస కూలీల కన్నీటిగాథలు ప్రభుత్వానికి పట్టవని.. రాజకీయ మద్దతు కోసమే కంగనాకు వై ప్లస్ భద్రత కల్పించారని విమర్శించారు.

    Also Read: మరో గొప్ప ప్రయత్నం చేస్తున్న సోనూసూద్

    దీంతోపాటు బీజేపీకి వంతపాడుతున్న కంగనాను ఉద్దేశించి.. ‘ఒక చిత్రం చేసి కంగనా తను రాణి లక్ష్మి భాయ్ అనుకుంటే.. దీపికా పదుకోన్ పద్మవతి.. హృతిక్ రోషన్ అక్బర్.. షారుక్ ఖాన్ అశోక్ చక్రవర్తి అవుతారు’ అంటూ మరో ఫొటోతో సైటర్ వేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.