ప్రజలను పన్నులతో బాది పిండుకుంటున్న జగన్

ఏపీలోని ప్రజలపై పన్ను భారం మోపేందుకు  సీఎం జగన్ సిద్ధమయ్యారు. కరోనాతో అన్నిరంగాలు కుదేలై ఇబ్బందులు పడుతుండగా ప్రభుత్వం మాత్రం ఆదాయం కోసం పన్నులను పెంచుతున్నట్లు తాజాగా ప్రకటించడం శోచనీయంగా మారింది. కరోనా ఎఫెక్ట్ తో ఉపాధిలేక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న ప్రజలపై జగన్ సర్కార్ మరోసారి పన్నులు పెంచడంపై విమర్శలు వెల్లువెత్తుతోన్నాయి. Also Read: చంద్రబాబుకు ఇంతకు మించిన అవమానం ఉంటుందా….? జగన్ సర్కార్ తాజాగా ఏపీలోని సహజవాయువుపై 10శాతం మేర వ్యాట్ పెంచుతున్నట్లు శనివారం […]

Written By: NARESH, Updated On : September 12, 2020 6:08 pm
Follow us on

ఏపీలోని ప్రజలపై పన్ను భారం మోపేందుకు  సీఎం జగన్ సిద్ధమయ్యారు. కరోనాతో అన్నిరంగాలు కుదేలై ఇబ్బందులు పడుతుండగా ప్రభుత్వం మాత్రం ఆదాయం కోసం పన్నులను పెంచుతున్నట్లు తాజాగా ప్రకటించడం శోచనీయంగా మారింది. కరోనా ఎఫెక్ట్ తో ఉపాధిలేక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న ప్రజలపై జగన్ సర్కార్ మరోసారి పన్నులు పెంచడంపై విమర్శలు వెల్లువెత్తుతోన్నాయి.

Also Read: చంద్రబాబుకు ఇంతకు మించిన అవమానం ఉంటుందా….?

జగన్ సర్కార్ తాజాగా ఏపీలోని సహజవాయువుపై 10శాతం మేర వ్యాట్ పెంచుతున్నట్లు శనివారం ఉత్తర్వులను జారీ చేసింది. గతంలో 14.5శాతంగా ఉన్న వ్యాట్ ను 24.5శాతానికి పెంచుతున్నట్లు వాణిజ్య పన్నుల శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. కాగా ఇప్పటికే జగన్ సర్కార్ ఐదు రకాల పెట్రోల్ ఆధారిత ఉత్పత్తులపై వ్యాట్ పెంచేసింది.

ముడిచమురుపై 5శాతం.. పెట్రోల్ పూ 31శాతం వ్యాట్ తోపాటు అదనంగా నాలుగు రూపాయాల పన్ను వసూలు చేస్తోంది. డీజిల్ పై 22.5శాతంతోపాటు అదనంగా నాలుగు రూపాయలు.. ఎయిర్ టర్బైన్ ప్యూయల్ పై ఒక శాతం మేరకు వ్యాట్ పెంచి వసూలు చేస్తోంది. రాష్ట్రంలో గత ఐదునెలలుగా కరోనా మహమ్మరి కారణంగా ప్రభుత్వ ఆదాయానికి గండిపడింది. 2020 ఏప్రిల్ నాటికి రూ.4,480కోట్ల రూపాయాల ఆదాయం రావాల్సి ఉండగా రూ.1323కోట్ల ఆదాయం వచ్చినట్లు ప్రభుత్వం చెబుతోంది.

Also Read: పవన్ ను సైడ్ చేయడమే జగన్, బాబు లక్ష్యమా?

గతంలో కోల్పోయిన ఆదాయాన్ని సమకూర్చుకునేందుకు సహజ వాయువుపై పన్నుపై 10శాతం పన్ను పెంచుతున్నట్లు ప్రకటించింది. ప్రభుత్వ పథకాలు అమలు చేసేందుకు నిధులు కావాల్సిన ఉన్నందునే వ్యాట్ పెంచుతున్నట్లు జగన్ సర్కార్ పేర్కొనడం గమనార్హం. కరోనాతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలపై ప్రభుత్వాలు పన్నులభారం మోపడంపై మాత్రం పెద్దఎత్తున విమర్శలు వస్తున్నాయి.