Prakash Raj: ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలని చెబుతారు పెద్దలు. ఇది అక్షరాల ప్రకాశ్ రాజ్ విషయంలో సత్యం. సినిమా ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో మంచు విష్ణు చేతిలో ఘోర పరాభవం చెందిన ప్రకాశ్ రాజ్ ప్రస్తుతం తన రూటు మార్చుకున్నారు. తన ఓటమికి కారకులైన వారిని ఎదుర్కొనే క్రమంలో రాజకీయమనే అస్ర్తం ఎంచుకున్నారు. త్వరలో రాజకీయ తెరంగేట్రానికి ప్రణాళికలు రచిస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే పలువురు ప్రముఖులతో మంతనాలు సాగించినట్లు ప్రచారం సాగుతోంది.

మా ఎన్నికల్లో తన పరాభవానికి కారణం వైసీపీ అని పరోక్షంగా తెలియడంతో ఆయన దానిపై పోటీకి నిలవాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. గతంలో కూడా బీజేపీపై కోపంతో పోటీ చేసినా ఓటమి పాలయిన సంగతి తెలిసిందే. దీంతో ఇప్పటికి కూడా బీజేపీపై పలు ఘాటు విమర్శలు సామాజిక మాధ్యమాల్లో పెడుతుంటారు. ప్రకాశ్ రాజ్ జనసేనలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. కానీ ప్రకాశ్ రాజ్ చేరికకు నిర్ణయించుకున్నా ప్రస్తుత తరుణంలో జనసేన బీజేపీతో పొత్తు ఉన్న నేపథ్యంలో ఎటూ తేల్చుకోలేకపోతున్నారని సమాచారం. దీనిపై పవన్ కల్యాణ్ కూడా సరైన సమయంలో క్లారిటీ ఇచ్చేందుకు నిర్ణయించినట్లు తెలుస్తోంది.
ప్రకాశ్ రాజ్ అధికారికంగా జనసేన లో చేరితే రాజకీయ సమీకరణలు మారుతాయా అనే కోణంలో అనుమానాలు వస్తున్నాయి. ప్రకాశ్ రాజ్ లాంటి వ్యక్తుల చేరికతో జనసేన బలం పెరిగిపోయే సూచనలు కనిపిస్తున్నాయని పలువురు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఏది ఏమైనా ప్రకాశ్ రాజ్ నిర్ణయాన్ని పవన్ కల్యాణ్ కూడా ఆహ్వానిస్తున్నట్లు సమాచారం. దీంతో భవిష్యత్ లో పార్టీల్లో మరిన్ని కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ప్రకాశ్ రాజ్ జనసేనలో చేరితే రాజకీయాలు కొత్త మలుపు తిరుగుతాయని భావిస్తున్నారు. వైసీపీ మీద కోపంతోనే ఆయన జనసేనలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి ఏపీలో పలు కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. పార్టీల్లో నేతల చేరికతో బలాలు పెరిగిపోయి రాబోయే ఎన్నికల్లో పోటీ తీవ్రమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయని పలువురు పేర్కొంటున్నారు.