AP Power Cuts: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్ కోతలు షురూ అయ్యాయి. ఎడాపెడా కోతలు అమలు చేస్తున్నారు దీంతో ప్రజలు ఇక్కట్లు పడుతున్నారు. రైతులు ఆందోళన చెందుతున్నారు. పంటలు చివరి దశకు రావడంతో కంగారు పడుతున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే నెలాఖరులో ఎంత తీవ్రంగా కోతలు అమలు చేస్తారో తెలియడం లేదు. ఈ నేపథ్యంలో ఇంధన శాఖ కార్యదర్శి శ్రీధర్ స్పందించారు. కోతలు తాత్కాలికమే అని చెబుతున్నారు. గృహ, వ్యవసాయ రంగాలకు ఆటంకాలు కలగకూడదనే ఉద్దేశంతో పరిశ్రమలపై ఆంక్షలు విధించినట్లు చెప్పారు.

వేసవి కాలం కావడంతో విద్యుత్ డిమాండ్ పెరిగిపోతోంది. రాష్ట్రంలో కరెంట్ వినియోగం నానాటికి పెరుగుతోంది. అందుకే కోతలు అమలు చేస్తున్నారనే సంగతి తెలుస్తోంది. పట్టణాల్లో అరగంట, పల్లెల్లో గంట పాటు కోతలు విధిస్తున్నట్లు చెబుతున్నారు. మరోవైపు విద్యుత్ వినియోగం డిమాండ్ 230 మిలియన్ యూనిట్లు ఉండగా 180 మిలియన్ యూనిట్లు మాత్రమే ఉత్పత్త జరుగుతోంది. దీంతో ఆంక్షలు తప్పడం లేదు. ఈ కోతలు ఏప్రిల్ చివరి వారం వరకు కొనసాగే అవకాశం ఉంది.
Also Read: CM Jagan Sensational Comments: వెంట్రుక కూడా పీకలేరు.. మీరు పీకినవి చాలు సీఎం జగన్ గారు
విద్యుత్ ఉత్పత్తికి ఉపయోగించే బొగ్గు కొరత ఏర్పడింది. గతంలో ఇరవై నాలుగు రోజులకు సరిపడా నిల్వలు ఉంటే ప్రస్తుతం ఏ రోజుకారోజు తీసుకొచ్చి ఉత్పత్తి చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.దీంతో ఉత్పత్తిలో ఆటంకాలు వస్తున్నాయి. అందుకే కోతలు అమలు చేయక తప్పడం లేదు. దీనిపై ప్రజలు గమనించాలని కోరుతున్నారు. రాష్ట్రంలో మూడు డిస్కంల పరిధిలో ఏప్రిల్ 8 నుంచి 22 వరకు రెండు వారాలు పరిశ్రమలకు పవర్ హాలిడే ప్రకటిస్తున్నట్లు ఏపీ ట్రాన్స్ కో ప్రకటించింది.

పరిశ్రమలకు వారంలో ఒకరోజు హాలిడే ప్రటిస్తున్నారు. వారాంతపు సెలవుకు ఇది అదనంగాఉంటుంది. మూడు డిస్కంల పరిధిలో పవర్ హాలిడే షెడ్యూల్ విడుదల చేశారు. విద్యుత్ డిమాండ్ పెరిగినందున కోతలు అమలు చేయక తప్పడం లేదు. అందుకే రాష్ట్రంలో విద్యుత్ కోతలు అమలు చేస్తున్నారు. ప్రభుత్వం కూడా ఏం చేయలేని అచేతన స్థితిలో ఉంది. అందుకే అధికారులు కోతలు విధిస్తూ పరిస్థితిని చక్కదిద్దుతున్నారు. ఇదివరకే వాషింగ్ మిషన్లు, ఏసీలు వాడొద్దని సూచించినట్లు తెలిసిందే.
Also Read:Mahesh Babu: మళ్లీ 30 మంది ప్రాణాలు కాపాడిన మహేష్ బాబు !
[…] AP CM Jagan: ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాల్లో మార్పులు వస్తున్నాయి. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పార్టీలు ముందుకెళ్తున్నాయి. ప్రతిపక్షాలు అధికారపక్షం, అధికార పార్టీ ప్రతిపక్షాలపై దుమ్మెత్తిపోస్తున్నాయి. ఏదైనా మంచి పని చేస్తుంటే అడ్డుపడుతున్నాయని జగన్ చెబుతుంటే రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. మొత్తానికి రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. ఓ పక్క జగన్ సంక్షేమ పథకాలతో ఆకట్టుకోవాలని చూస్తున్నారు. ఖజానా మొత్తం ఖాళీ చేసి ప్రజల ఖాతాల్లో నిధులు సమకూరుస్తున్నారు. […]