Zerodha: ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యంగా ఉంటేనే ఏదైనా చేయవచ్చు. జీవితంలో దేన్నయినా సాధించవచ్చు అలాంటి ఆరోగ్యమే లేకపోతే ఇక వ్యర్థమే. అందుకే ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటారు. ఈ నేపథ్యంలో ఓ ఆన్ లైన్ సంస్థ తమ ఉద్యోగుల్లో పరివర్తన తీసుకొచ్చేందుకు ఓ బృహత్తర కార్యక్రమం చేపట్టింది. ఉద్యోగులు ఫిట్ గా ఉండాలనే ఉద్దేశంతో వారిలో పోటీతత్వం తీసుకొచ్చింది. కరోనా కాలంలో ఇంటి నుంచే పని చేసిన ఉద్యోగులు కాస్త మందమయ్యారు. దీంతో ఆ సంస్థ సీఈవో ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణకు నడుం బిగించారు. వారిని ఫిట్ గా ఉంచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

మనిషికి మందమే అందం. మందంగా ఉన్నవారే అందంగా కనిపిస్తారు. కానీ అది మరీ ఎక్కువ కాకూడదు. చక్కనమ్మ చిక్కినా అందమే అంటారు. అందమనేది చూసేవారి దృష్టిని బట్టే ఉంటుంది. ఇక్కడ జెరోదా ఆన్ లైన్ బ్రేకింగ్ సంస్థ సీఈవో నితిన్ కామత్ ఉద్యోగులు కాస్త మందమయ్యారని వారిని అందంగా తీర్చిదిద్దే పనిలో పడ్డారు. దాని కోసం ఓ బంపర్ ఆఫర్ ప్రకటించారు. దీన్ని ట్విటర్ వేదికగా ప్రకటించారు. ధీంతో ఉద్యోగుల్లో పోటీ ఏర్పడింది.
Also Read: CM Jagan Sensational Comments: వెంట్రుక కూడా పీకలేరు.. మీరు పీకినవి చాలు సీఎం జగన్ గారు
బాడీ మాస్ ఇండెక్స్ (బీఎంఐ) 25 కంటే తక్కువ ఉన్న ఉద్యోగులకు నెల జీతం బోనస్ గా ప్రకటంచారు. ఆగస్టు నాటికి దాన్ని 24 దిగువకు తీసుకొస్తే సగం నెల జీతం బోనస్ గా ఇస్తామని ఆఫర్ వెల్లడించారు. దీంతో ఉద్యోగులు తాము ఆ ఆఫర్ అందుకోవాలని ఆరాటపడుతన్నారు. చిక్కడం కోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. మొత్తానికి జెరోకో సంస్థ ప్రకటించిన ఆఫర్ కు ఉద్యోగులు ఫిదా అయిపోతున్నారు. తమ ఆరోగ్య రక్షణతోపాటు డబ్బులు కూడా వస్తుండటంతో సద్వినియోగం చేసుకోవాలని తాపత్రయపడుతున్నారు.

నితిన్ కామత్ చేపట్టిన ప్రోగ్రామ్ ఫిట్ నెస్ టాస్క్ ను చేరుకోకపోయినా నిర్దేశించుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి ఆయన లక్కీ డ్రా కూడా నిర్వహించారు అందులో గెలిచిన వారికి రూ. 10 లక్షలు నజరానా ప్రకటించారు దీంతో ఉద్యోగుల్లో ఒకటే ఆతృత. తాము ఆ బహుమతి గెలుచుకోవాలని ఉవ్విళ్లూరుతున్ారు. ఉద్యోగులను ఫిట్ గా ఉంచేందుకు ఇలాంటి ప్రయోగాలు బెడిసికొడతాయని కొందరి అభిప్రాయమున్నా అందరు మాత్రం తమ కోసమే కదా అని సమర్థించుకుంటున్నారు. మొత్తానికి సంస్థ ఉద్యోగుల కోసం ఆ సీఈవో తపన చూస్తుంటే వారికి మేలు చేస్తున్నారనే తెలుస్తోంది.
Also Read:Akhil Agent Movie: వైరల్ : సిగరెట్ కాలుస్తూ వైల్డ్ గా అఖిల్